ఏంటయ్యా థమనూ ఆ స్పీడ్... "ఆర్సీ 15" కోసం ఇంత ఫాస్ట్ గానా !!

Vimalatha
ఇటీవల కాలంలో సౌత్ లో యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ థమన్ దూకుడు బాగా ఎక్కువైంది. ఇటీవల కాలంలో ఆయన సంగీత దర్శకత్వం వహించిన "సర్కారు వారి పాట, భీమ్లా నాయక్" టీజర్ల ఎఫెక్ట్ తో ఈ మ్యూజిక్ డైరెక్టర్ క్రేజ్ తారా స్థాయికి వెళ్ళింది. తమ సినిమాలకు అతనే మ్యూజిక్ అందించాలని స్టార్ హీరోలతో పాటు మేకర్స్ కూడా పట్టు పట్టుకు కూర్చుంటున్నారు. ఈ నేపథ్యంలో థమన్ ఎంత స్పీడ్ గా పని చేస్తున్నాడో తెలిస్తే ఏంటయ్యా థమనూ ఆ స్పీడ్...! అని ఆశ్చర్యపోక మానరు.
విషయంలోకి వస్తే... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా పాన్ ఇండియా మూవీ "ఆర్సీ 15". సౌత్ మొత్తం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తాత్కాలికంగా ఈ ప్రాజెక్ట్ ను #RC15 అని పిలుస్తున్నారు. ఈ చిత్రానికి "విశ్వంభర" అనే టైటిల్ ను అనుకుంటున్నారన్న టాక్ నడుస్తోంది. అది వేరే విషయం అనుకోండి. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. థమన్ దీనికి సంగీతం సమకూరుస్తున్నారు. శంకర్‌తో థమన్ కలిసి పని చేయడం ఇదే మొదటిసారి. ఇంతకు ముందు శంకర్ "బాయ్స్‌"లో మ్యూజిక్ కంపోజర్ లీడ్‌లలో ఒకడిగా నటించాడు  థమన్. కానీ తరువాత ఆయన సినిమాలకు సంగీతం అందించలేదు
అయితే తాజా విషయం ఏమిటంటే ఈ సినిమాకు అప్పుడే థమన్ సగం పని పూర్తి చేశాడట. సినిమాలో మొత్తం ఏడు పాటలు ఉండగా... థమన్ అప్పుడే 3 పాటల కంపోజింగ్ పూర్తి చేశాడట. ఇటీవలి ఇంటర్వ్యూలో థమన్ మాట్లాడుతూ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా తనను తీసుకోవాలని శంకర్ మొండిపట్టు పట్టారని అన్నారు. ఆ సమయంలో థమన్ "వకీల్ సాబ్" రీ-రికార్డింగ్‌లో పనిలో ఉన్నాడట. "నేను శంకర్ సార్‌ని కలిసినప్పుడు, అతను ఒక నెలలోపు ట్యూన్ కంపోజ్ చేయమని అడిగాడు. నేను మార్చి, ఏప్రిల్ , జూలైలో ఒక్కో పాటను కంపోజ్ చేసాను. నేను శంకర్ సర్‌తో కలిసి సంతోషిస్తాను, భయపడను. శంకర్ సార్ సినిమాల్లోని ప్రతి పాటకూ ఒక కాన్సెప్ట్ ఉంటుంది" అని థమన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: