ఇది క‌థ కాదు ! : రోజా స‌క్సెస్ స్టోరీ ఏంటి?

RATNA KISHORE
రోజా జ‌బ‌ర్ద‌స్త్ మానుకోరు
రోజాకు న‌ట‌న  ఇష్టం
రోజాకు రాజకీయం అంటే ఇష్టం
కూతురు అంటే ఇష్టం అన‌డం భావ్యం కాదు ప్రాణం అని రాయాలి
ఇదీ రోజా జీవితం..మ‌నం పైకి పొగ‌డ్త కు సంబంధించిన మాటలు అని లోప‌ల ఈస‌డించుకోవ‌డం త‌ప్పు అని చెప్పే క‌థ ఇది.


రాజ‌కీయంగా రోజా ఎన్ని మాట్లాడినా ఎన్ని త‌ప్పులు మాట్లాడినా ఎవ్వ‌రూ ఆమెను ప‌ట్టించుకోరు అనేందుకు వీల్లేదు. కానీ సిని మా కెరియ‌ర్ ప‌రంగా కూడా ఆమె ఎన్నో అవ‌మానాలు చ‌వి చూశారు అంటే అది ఒప్పుకోవాలి. నిజం క‌దా! నీకు న‌ట‌న రాదు అని చెప్పండి ఎంతగా ఏడ్చేస్తారో ఆమె ఇప్పుడు..ఇదే మాట కొన్నేళ్ల క్రితం విని కూడా క‌న్నీటి ప‌ర్యంతం అయ్యాన‌ని గుర్తు చేసుకు న్నారు రోజా. జీవితం ఓట‌మి నుంచి ఏమ‌యినా ఇచ్చి పోతుంది. ఆ ఇచ్చే వాటిని విశ్లేషిస్తేనే విజ‌యాలు. రోజా రాజ‌కీయంలోనూ ఐర‌న్ లెగ్ అన్నారు. ఆమె ఉన్న చోట స‌క్సెస్ లేద‌ని టీడీపీనే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నారు. అవ‌న్నీ కాద‌ని ఆమె గెలిచారు. జ‌గ‌న్ పార్టీని గెలిపించేందుకు త‌నవంతు సాయం చేశారు. బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థుల నోళ్లు మూయించి, త‌నకు రాజ‌కీయ జీవితం ఇచ్చి న పార్టీనే వ‌ద్ద‌నుకుని వ‌చ్చి, పోరాడారు. పోరాడి గెలిచారు.


పొలిటీషియ‌న్ రోజా అని చెప్ప‌డం అస్స‌లు నచ్చ‌దు కాదు న‌ప్ప‌దు ఈ క‌థ‌నానికి. నిజ జీవితంలో రోజా చాలా ఎమోష‌న‌ల్ గా ఉం టార‌ని అంటారు. అలా ఎందుకు ఉంటారు. ఆమె జీవితంలో ఉన్న త‌ప్పిదాలు ఏంటి అన్న‌వి ఎప్పుడూ ఆస‌క్తిని రేపుతూనే ఉంటా యి. ఓ ద‌శ‌లో జ‌గ‌న్ కూడా జ‌బ‌ర్ద‌స్త్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేయాల‌ని చెప్పినా ఆమె రాలేదు. ఆమె న‌ట‌న‌పై ఆస‌క్తి ఎక్కువ అన్న ది ఇవాళ్టికీ రుజువులో ఉన్న నిజం. త‌న‌కు అన్నం పెట్టిన ఈటీవీని ఆమె వ‌దులుకోరు.


రాజకీయంగా ఏవేవో మాట్లాడినా అవేవీ ప‌ట్టించుకోరు రోజా.! ఇప్పుడే కాదు కెరియ‌ర్ తొలి రోజుల్లోనూ ఇలానే ఆమె ఉండేవారు. త‌న‌కు న‌ట‌న రాద‌న్నా డైలాగ్ చెప్ప‌డం రాద‌న్న చాలా ఏడ్చేవారు. ఇదే మాట ఆమె నిన్న‌టి వేళ చెప్పారు. ఈటీవీలో ప్ర‌సారం అ యిన ఊరిలో వినాయ‌కుడు కార్య‌క్ర‌మం లో త‌న జీవితం, త‌న ఓట‌మి అందుకు తావిచ్చిన ప‌రిణామాలు ఇలా అన్నింటినీ వివ‌రిం చి మ‌ళ్లీ ఏడ్చేశారు. త‌న కెరియ‌ర్ సెల్వ‌మ‌ణి తో ట‌ర్న్ అయింద‌ని, కానీ అంత‌కుముందు తాను ప‌డిన పాట్లు అన్నీ ఇన్నీ కావ‌ని చెబు తూ, చామంతి సినిమా త‌న జీవితానికో గాడ్ గిఫ్ట్ లాంటిద‌ని, ఆ సినిమాను సెల్వ‌మ‌ణి డైరెక్ట్ చేశాక‌నే, ఆయ‌న‌తో పెళ్లి కుది రింద‌ని తెలిపారు. త‌న కుటుంబం నిర్మించిన స‌మ‌రం చిత్రంతో తాము ఆస్తులు పోగొట్టుకుని అప్పులు పాల‌య్యామ‌ని కూడా  చె ప్పి ఏడ్చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tg

సంబంధిత వార్తలు: