గన్‌తో కాల్చుకొని చనిపోవాలనుకున్న పవన్ కళ్యాణ్..!!

N.ANJI
తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్, మెగాస్టార్ సోదరుడు పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయన తన నటనతో ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపు తెచ్చుకొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈయన వ్యక్తిగతంగా కూడా అభిమానుల హృదయాలలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా బాధ్యతలు చేపట్టిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఎంతో ధైర్యంగా ఉండే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో చనిపోవాలని అనుకున్నారంట. ఆయన ఎందుకో చనిపోవాలని అనుకున్నారో ఒక్కసారి చూద్దామా.
అయితే పవన్ కు తన అన్నయ్య చిరంజీవి అంటే ఎంతో గౌరవం, అభిమానం అని అందరికి తెలిసిందే. అంతేకాదు.. ఏవైనా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు చిరంజీవి గురించి అద్భుతంగా చెబుతుంటాడు పవన్. ఇక ఇదిలా ఉంటే గతంలో చిరంజీవి పుట్టినరోజు వేడుకలో పాల్గొని కొన్ని విషయాలు పంచుకోగా.. ప్రస్తుతం ఆ విషయాలను పవన్ అభిమానులు గుర్తు చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఎప్పుడూ కూడా చిరంజీవికి సంబంధించిన ఏ వేడుకలోనైనా కూడా చిరంజీవి గురించి వివరిస్తూ ఉంటాడు పవన్.
అంతేకాదు.. ఆ కార్యక్రమంలో మాట్లాడిన పవన్.. తను ఇంటర్ ఫెయిల్ అయినప్పుడు నిరాశ చెందానని నిస్పృహలకు లోనయ్యానని తెలిపారు. అంతేకాక.. తట్టుకోలేక తన అన్నయ్య దగ్గర ఉన్న పిస్తోలుతో కాల్చుకొని చనిపోదాం అనుకున్నట్లు తెలిపారు. ఇక ఆ సమయంలో తన అన్నయ్య చిరంజీవి చెప్పిన మాటలు తనలో విశ్వాసాన్ని నింపాయని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు ఈ స్థితిలో ఉండడానికి కారణం తన అన్నయ్య అంటూ తన అన్నయ్యను పొగడ్తలతో ముంచెత్తారు.అంతేకాక.. ఇలాంటి అన్నయ్య ప్రతి ఒక్క ఇంట్లో ఉంటే ఆత్మహత్యలు జరగవని తెలుపగా ప్రస్తుతం ఈ విషయం మళ్ళీ వైరల్ గా మరి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: