మహేష్ బాబుకు మంచి కమర్షియల్ హిట్ నిచ్చిన ఒక్కడు..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లో ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ లు ఉన్నాయి. అలా మహేష్ బాబు కెరియర్ ను మంచి జోష్ కు తీసుకువచ్చిన సినిమాలలో ఒకటి 'ఒక్కడు'. ఈరోజు మనం 'ఒక్కడు' సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
అది 1998 సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటి సినిమా 'రాజకుమారుడు' షూటింగ్ జరుగుతున్న సమయం. ఈ సినిమాకు అశ్వనీదత్ నిర్మాత. ఇదే సమయంలో చిరంజీవి హీరోగా 'చూడాలని ఉంది' సినిమా చిత్రీకరణ జరుగుతుంది. ఈ సినిమాకు నిర్మాత అశ్వినీదత్. 'చూడాలని ఉంది' సినిమా కు దర్శకుడు గుణశేఖర్. ఒక సమయంలో మహేష్ బాబు అశ్వినీదత్ తో మాట్లాడాల్సిన పని మీద 'చూడాలని ఉంది' సినిమా షూటింగ్ స్పాట్ కు వెళ్ళాడు. అక్కడ గుణశేఖర్ , మహేష్ బాబు చూశాడు. గుణశేఖర్ ఎప్పటి నుండో ఒక కథ అనుకుంటున్నాడు. ఆ కథలో హీరో చార్మినార్ మీద కూర్చొని స్టైల్ గా సిగరెట్ తాగుతూ ఉంటాడు. మహేష్ బాబు ను చూసిన వెంటనే గుణశేఖర్ కు ఆ సినిమాలో ఆయన రాసుకున్న హీరో పాత్ర గుర్తుకు వచ్చింది.

 వెంటనే ఆయనకు కథ చెప్పేశాడు. మహేష్ బాబు ఫుల్ గా ఎగ్జైట్ అయ్యాడు. కానీ ఇప్పుడు మూడు సినిమాలకు కమిట్ అయ్యాను సార్ తర్వాత చూద్దాం అని చెప్పాడు. దానితో గుణశేఖర్ కూడా ఓకే అన్నాడు. ఆ తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన 'మృగరాజు' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్ గా నిలిచింది. అయిన కూడా మహేష్ బాబు చెప్పిన మాట ప్రకారం గుణశేఖర్ తో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. సినిమాకు ఎమ్మెస్ రాజు నిర్మాత. భూమిక ను చిత్ర యూనిట్ హీరోయిన్ గా ఎంపిక చేసుకుంది. సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ సినిమా కోసం చార్మినార్ సెట్ ని వేశారు. సినిమా షూటింగ్ అంతా చకచకా పూర్తి చేసుకొని థియేటర్లలోకి వచ్చేసింది. సినిమా మొదటి షో నుండే బ్లాక్ బాస్టర్ టాక్ రావడంతో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ముందుకు దూసుకుపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: