సెండ్ డే కలెక్షన్స్... "సీటిమార్" అనాల్సిందే !

Vimalatha
మాచో హీరో గోపీచంద్ కొన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్న హిట్ ఎట్టకేలకు "సీటిమార్" రూపంలో ఆయనను పలకరించింది. హిట్ గురించి చాలా కాలమే ఎదురు చూసిన గోపీచంద్ ఈ సినిమాపై బాగానే ఆశలు పెట్టుకున్నాడు. సినిమా ప్రమోషన్లకు కూడా ఏ స్టార్ హీరోనూ పిలవకుండానే కానిచ్చేశారు. ఇక ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని పలు కారణాలతో వాయిదాల అనంతరం సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇక ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. గోపీచంద్ తో పాటు సినిమా ఇండస్ట్రీకి కూడా ఈ సినిమా హిట్ ఎంతో ప్రత్యేకం అన్న విషయం చెప్పక్కర్లేదు. ప్రేక్షకులతో పాటు విమర్శకులను కుడి విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇన్నిరోజులు థియేటర్ రిలీజ్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసిన మేకర్స్ "సీటిమార్" అనేలా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ఇక సినిమా ఫస్ట్ డే, సెకండ్ డే కలెక్షన్స్ కు అదిరిపోయాయని టాక్. కరోనా సెకండ్ వేవ్ తరువాత బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చిన చిత్రం ఇదే కావడం విశేషం. పైగా మొదటి రోజే దాదాపు 33% కలెక్షన్స్ ను రాబట్టేసిందట.తెలుగు రాష్ట్రాల నుండి 2.95 కోట్ల షేర్ వసూలు చేసింది. రెండవ రోజు కూడా సీడెడ్ లో 52 లక్షలు వసూళ్లు రాబట్టింది.  చిత్రం బ్రేక్ ఈవెన్ కోసం తెలుగు రాష్ట్రాల నుండి దాదాపు 12.82 కోట్ల షేర్ వసూలు చేయాలి. ఇక్కడ ఏరియాల వారీగా 1వ రోజు ఆంధ్రా, తెలంగాణ "సీటీమార్" కలెక్షన్లు ఉన్నాయి.
నైజాం - 0.9 లక్షలు
సీడెడ్ - 0.54 లక్షలు
గుంటూరు - 0.41 లక్షలు
తూర్పు - 0.27 లక్షలు
పశ్చిమ - 0.16 లక్షలు
కృష్ణ - 0.19 లక్షలు
నెల్లూరు - 0.19 లక్షలు
ఆంధ్రా, తెలంగాణ - 2.95 కోట్లు
ఆంధ్రా, తెలంగాణ గ్రాస్ : 4.75 కోట్లు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: