షాకింగ్: కొరటాలను రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్ ?

VAMSI
యంగ్ టైగర్ మరియు కొరటాల శివ కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ ఒకే అయిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఎప్పుడో అఫిషియల్ గా అనౌన్స్మెంట్ రావడం జరిగింది. ఈ సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం జరుగుతూనే ఉంది. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది. అందులోనూ అది సినిమాకి మూలమైన కథ గురించి కావడంతో మరింత హైలెట్ అయింది. వీరి కాంబోలో తెరకెక్కే చిత్రం కోసం కథను సిద్దం చేసే పనిలో పడ్డారట కొరటాల. అయితే కథ కోసం ఓ ఐడియా తట్టడంతో వెంటనే దాన్ని తారక్ కు వినిపించారట. స్టూడెంట్ లీడర్ గా ఉన్నటువంటి ఓ యువకుడు తన కృషితో, తెలివితో అంచలంచెలుగా ఎదిగి ఒక పెద్ద కంపెనీకి సీఈఓగా అవుతాడు. 
అయితే  ఓ పాయింట్ లో తను దేశ మ్యాప్ నుండి  అనూహ్యంగా ఓ గ్రామం మాయం కావడం అనే  సమస్యను తాను టేకప్ చేసి ఆ పద్మవ్యూహంన్ని చేదించే లాంటి పాయింట్ ఒకటి శివ తారక్ కు చెప్పినట్లు సమాచారం. అయితే ఇది విన్న ఎన్ టి ఆర్ అంతా బాగానే ఉంది. కానీ కథ కాస్త ఓల్డ్ గా అనిపిస్తోంది అంటూ సున్నితంగా తిరస్కరించినట్లు చెబుతున్నారు. దాంతో మళ్ళీ మరో కొత్త కథను రెఢీ చేసే పనిలో పడ్డారట కొరటాల శివ. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ అని తెలుస్తోంది. వీరి కథ రెడీ అయ్యేది ఎప్పుడు అది షురూ అయ్యేది ఇంకెప్పుడు అంటున్నారట యంగ్ టైగర్ ఎన్ టి ఆర్ అభిమానులు.
మరి కొరటాల లైన్ ను ఇకనైనా స్పీడ్ అప్ చేసి మరో కథను సిద్దం చేస్తారని ఆశిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి కథ ఎప్పుడు ఫైనల్ అవుతుందో చూడాలి. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ కోసమా అందరి లాగే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. మరి ఈ సినిమా రిలీజ్ పై చిత్ర బృందం ఇంకా సరైన క్లారిటీ ఇవ్వడం లేదు. ఇంకెప్పుడు ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అనేది తెలియాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: