బ్యాచిలర్ నుండి మరో సాంగ్ రిలీజ్ ... ఎప్పుడంటే ... ??

GVK Writings
ప్రస్తుతం అఖిల్ తో బొమ్మరిల్లు భాస్కర్ తీస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. కొంత విరామం తరువాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న భాస్కర్ ఈ మూవీ తో ఎలాగైనా భారీ సక్సెస్ కొట్టాలని స్టోరీ, స్క్రిప్ట్ ఎంతో పక్కాగా రాసుకున్నట్లు టాక్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని బన్నీ వాసు, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మిస్తుండగా గోపిసుందర్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నారు.
మరొకవైపు సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ కూడా ఈ ప్రాజక్ట్ పై ఎంతో బాగా నమ్మకం పెట్టుకున్నట్లు టాక్. మంచి రొమాంటిక్ ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అఖిల్, పూజా ల మధ్య వచ్చే లవ్ ట్రాక్, రొమాంటిక్ సీన్స్ యువతని విశేషంగా ఆకట్టుకుంటాయని, అలానే కొన్ని ఫ్యామిలీ సీన్స్ అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరిస్తాయని ఇన్నర్ వర్గాల సమాచారం. ఈష రెబ్బ, ఆమని, మురళి శర్మ, వెన్నెల కిషోర్, ప్రగతి తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ సినిమా అక్టోబర్ 8 న దసరా కానుకగా విడుదల కానుంది.
ఇక ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు మూడు లిరికల్ సాంగ్స్ శ్రోతలను ఎంతో ఆకట్టుకుని సినిమాపై బాగా అంచనాలు క్రియేట్ చేసాయి. అయితే విషయం ఏమిటంటే, ఈ సినిమా నుండి నెక్స్ట్ సాంగ్ ని ఈ నెల 15న విడుదల చేయనున్నట్లు యూనిట్ కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా ప్రకటించింది. లెహరాయి అనే పల్లవితో మోస్ట్ మెలోడియస్ రొమాంటిక్ స్టైల్ లో సాగే ఈ సాంగ్ యువతని ఎంతో ఆకట్టుకుంటుందని సమాచారం. మొత్తంగా ప్రేక్షకాభిమానుల్లో మంచి హైప్ ఏర్పరిచిన ఈ సినిమా రేపు రిలీజ్ తరువాత ఎంత మేర సక్సెస్ కొడుతుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: