తన బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలిపిన ఆలియాభట్..!

Divya
ఆలియా భట్.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా, బ్యూటీ క్వీన్ గా గుర్తింపు పొందిన ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈమె మొదటి సారిగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవుతోంది. ఆలియా భట్ మేని రంగు ఎప్పుడు మెరిసిపోతూ చూపరులను ఆకట్టుకుంటుంది..అయితే ఆమె తనదైన శైలిలో అందం కోసం అలాగే అభినయం గా కనిపించడం కోసం ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆమెను ఇటీవల కొన్ని చిత్రాలలో మేకప్ లేకుండా కూడా నటించింది అంటే అది అతిశయోక్తి కాదు.ఇక బయటకు వెళ్ళినప్పుడు కూడా మనం ఈమెను మేకప్ లేకున్నా, మేకప్ వేసుకున్నట్లే కనిపించడం గమనించవచ్చు..ఇకపోతే ఈమె తన బ్యూటీ టిప్స్ గురించి మన తో పంచుకుంది. అది ఏంటో మనం కూడా ఒకసారి తెలుసుకుందాం..

ఆలియా భట్ అందరి హీరోయిన్ల లాగే అందంగా ఉండడం కోసం తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫేస్ ప్యాక్ ను ఇంట్లోనే సిద్ధం చేసుకుంటుందట.. ఇక ఆమె తయారు చేసుకునే పదార్థాలు మన ఇంట్లో కూడా లభిస్తాయి.. అయితే ఫేస్ ప్యాక్ కు కావలసిన పదార్థాలు ఏమిటి..? దానిని ఇప్పుడు మనం ఎలా కలపాలి..? ఎలా వాడాలి..? అనే విషయాలను ఒకసారి చూద్దాం..
ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని , ఒక టేబుల్ స్పూన్ తేనెతో పాటు ఒక టేబుల్ స్పూన్ ఆరెంజ్ పొడి కలుపుకోవాలి .ఒకవేళ ఆరెంజ్ పొడి అందుబాటులో లేనప్పుడు బొప్పాయి పండు పొడి ఒక టేబుల్ స్పూన్ తీసుకుని బాగా కలపాలి. ఇక ఈ మిశ్రమాన్ని ముఖానికి ఈవెన్ గా  అప్లై చేసి పదిహేను నిమిషాల వరకు వదిలేయాల్సి ఉంటుంది. ఇక మన చర్మం మీద వేసుకున్న ఫేస్ ప్యాక్  పొడిగా అయ్యే వరకూ అలాగే ఉంచి, తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి.. అంతే ఈ చిన్న టిప్స్ పాటిస్తే చాలు.. ఆలియాభట్ లాంటి అందమైన చర్మం మీ సొంతం అవుతుంది. శరీర ఆకృతి కోసం యోగా చేయడం , జిమ్ కి వెళ్లడం రాత్రి పడుకునే ముందు కెమికల్స్ లేని ప్రొడక్ట్స్ ను వాడడం ..లాంటివి చేస్తూ ఉంటుందట. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం , టైం పెట్టుకొని మరి నీటిని తాగుతూ ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: