బోయపాటి కి ఆఫర్ లే ఆఫర్ లు!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మాస్ దర్శకుడిగా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు బోయపాటి శ్రీను. ఆయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం నుంచి ఇప్పటి వరకు అన్ని కూడా మాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సినిమాలే కావడం విశేషం. తన సినిమా ల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ప్రేక్షకులను యాక్షన్ సీన్స్ ఎంతగానో ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఫైట్ సీన్స్ ప్రేక్షకులను ఆశ్చర్య పరిచేలా చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి బోయపాటి శ్రీను గత సినిమాతో ఒక్కసారిగా డౌన్ అయ్యాడు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఆయన చేసిన వినయ విధేయ రామ చిత్రం భారీ ఫ్లాప్ కావడంతో ఒక్కసారిగా ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. వాటిని చేరిపేయాలంటే బోయపాటి శ్రీను ఇప్పుడు చేస్తున్న అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి సిందే. బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య బాబు రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుండగా ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్లు ప్రేక్షకుల ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అఘోర టీజర్ మాత్రం అందరి మైండ్ బ్లాంక్ చేసింది.

ఇక గత కొన్ని రోజులుగా బోయపాటి శ్రీను తదుపరి సినిమా అవకాశం ఈ సినిమా ఫలితం పైన ఆధారపడి ఉందన్న వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుండగా అల్లు అర్జున్ సూర్య వంటి హీరోలు కూడా అఖండ ఫలితం కోసం ఎదురు చూస్తున్నట్లుగా వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బోయపాటి శ్రీను అభిమానులు అఖండ సినిమా తప్పకుండా విజయాన్ని వరిస్తుంది అని చెబుతున్నారు. ఒకవేళ ఈ సినిమా ఫలితం గనుక విజయవంతం అయితే ఆయనకు టాలీవుడ్ లో ఆఫర్లు మీద ఆఫర్లు వస్తాయి అని కూడా చెబుతున్నారు.మరి అఖండ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: