బాలయ్య స్టైల్ ని మార్చే పనిలో ఆ యంగ్ డైరెక్టర్... ?

Satya

నందమూరి నటసింహం బాలక్రిష్ణ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ప్రేమ కధలతో పాటు చాలా జానర్లలో  సినిమాలు చేశారు. అవి హిట్లు కూడా అయ్యాయి. అయితే బాలయ్య మీద మాస్ ముద్ర బలంగా ఉంది. అంతే కాదు, ఆయన యాక్షన్, ఫ్రాక్షన్ హీరో అని కూడా స్టాంప్ వేసేశారు.


దాంతో బాలయ్యతో మూవీ చేయాలనుకుంటే ఆ జానర్లలోనే కధ రెడీ చేసుకుని డైరెక్టర్లు వెళ్ళడం జరుగుతోంది. ఇది ఎంతదాకా వచ్చిందంటే బాలయ్య మూవీస్ లో యాక్షన్ ఏ మాత్రం తగ్గినా, పవర్ ఫుల్ డైలాగులు తగ్గినా కూడా ఫ్యాన్స్ ముందు సినిమా నో చెప్పేస్తున్నారు. ఇక బాలయ్య వంద చిత్రాలకు పైగా చేసినా కూడా ఒక రొటీన్  చట్రంలో నే ఇరుక్కున్నారని కూడా అంటారు. ఆయన దాని నుంచి బయటపడితే మరిన్ని హిట్లు వచ్చేవేమో.


ఇపుడు ఆడియన్స్ మూడ్ మారింది, టేస్ట్ కూడా మారింది. గతంలోలా భారీ డైలాగులను ఎవరూ ఇష్టపడడం లేదు, అలాగే వరసబెట్టి యాక్షన్ సీన్లు ఫైటింగులు కూడా ఉంటే సినిమాను రిజెక్ట్ చేస్తున్నారు. అయితే బాలయ్య మూవీస్ మాత్రం ఇంకా మూసలోనే ఉన్నాయని అంటున్నారు.  ఈ నేపధ్యంలో బాలయ్య లో కొత్త రకం నటకోణాన్ని అవిష్కరించడం అంటే ఒక చాలెంజే అంటున్నారు. ఆ పని ఎవరు చేసినా సక్సెస్ ఫుల్ గా చేస్తే బాలయ్య ఫ్యాన్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అదే టైమ్ లో బాలయ్య నుంచి మరిన్ని హిట్లు కూడా వస్తాయి.


అయితే ఇపుడు ఆ పనిని చేయాలనుకుంటున్నది ఎవరో కాదుట. అనిల్ రావిపూడి అంటున్నారు. అనిల్ రావిపూడి హిట్ల మీద మంచి జోరు మీద ఉన్నారు. ఆయన వెంకీతో ఎఫ్ 3, ఎఫ్ 3 మూవీస్ చేస్తున్నారు. ఆయన కామెడీయే సెపరేట్ ట్రాక్ లో  ఉంటుంది. హీరోల చేత కామెడీ పంచులు వేయిస్తూ ఆడియన్స్ ని నవ్వులతో గిలిగింతలు పెట్టే టాలెంట్ అనిల్ రావిపూడికి ఉంది. ఆయన బాలయ్య చేత కూడా కామెడీని చేయించాలనుకుంటున్నారుట. మరి బాలయ్య భారీ డైలాగులు, ఫైటింగ్స్ నుంచి కామెడీ పంచులతో తెర మీద కనిపిస్తే ఆడియన్స్ ఆదరిస్తారా అన్నది చూడాలి. ఏది ఏమైనా బాలయ్య అంటే ఇష్టపడే అనిల్ రావిపూడి అదిరిపోయే స్క్రిప్ట్ నే బాలయ్య కోసం రెడీ చేస్తున్నారు అంటున్నారు. ఈ దెబ్బతో బాలయ్య స్టైల్ ని కూడా అనిల్  పూర్తిగా మార్చేస్తాడు అని చెబుతున్నారు. చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: