ఆచార్య నుండి బిగ్ అప్ డేట్ రెడీ ... ??

GVK Writings
మెగాస్టార్ తో కలిసి ఫస్ట్ టైం ఆయన తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో ఆచార్య అనే మాజీ నక్సలైట్ పాత్ర పోషిస్తుండగా చరణ్, సిద్ద పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ తీస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజ హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
చరణ్ పాత్ర ఈ సినిమాలో ఎంతో కీలకం అని, అలానే సినిమాలో చిరు, చరణ్ ల మధ్య వచ్చే సీన్స్ మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని కూడా ఎంతో ఆకట్టుకుంటాయని యూనిట్ అంటోంది. ఇక దర్శకుడు కొరటాల శివ తన మార్క్ మెసేజ్, యాక్షన్ తో పాటు మెగాస్టార్ ఇమేజ్ కి ఏ మాత్రం తగ్గకుండా పలు మాస్ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో పొందుపరిచినట్లు టాక్. మరోవైపు ఆచార్య టీజర్, అలానే ఇందులోని లాహే లాహే సాంగ్ కి అందరి నుండి సూపర్ రెస్పాన్స్ దక్కడంతో పాటు అవి సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెంచాయి. ఇక లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న న్యూస్ ప్రకారం ఆచార్య నుండి మరొక వారంలో ఒక పెద్ద అప్ డేట్ రానున్నట్లు చెప్తున్నారు.
త్వరలో మూవీ రిలీజ్ కి సంబంధించి ఆచార్య యూనిట్ అఫీషియల్ గా ప్రకటన విడుదల చేయనుందని, అలానే ఈ మూవీ దసరా కి ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ లో ఎంతవరకు నిజా నిజాలు ఉన్నాయో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వరకు ఆగాల్సిందే అంటున్నారు సినిమా విశ్లేషకులు. మరి తొలిసారిగా చిరు, చరణ్ కలిసి నటిస్తున్న ఈ ఆచార్య మూవీ ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో చూడాలి.  
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: