నాని రిజెక్ట్ చేసిన పాత్రను చైతూ ఓకే చేశాడా..?

Anilkumar
టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని తాజా చిత్రం 'టక్ జగదీష్' అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన సంగతి తెలిసిందే.ప్రేక్షకులల్లో ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. ఇక ఇదిలా ఉంటె ఇటీవలే హీరో నాని రిజెక్ట్ చేసిన ఓ పాత్రని అక్కినేని హీరో నాగ చైతన్య ఓకే చేసాడట. ఆ వివరాల్లోకి వెళ్తే..బాలీవుడ్ లో అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'లాల్ సింగ్ చద్దా'.ఈ సినిమాలో నాగ చైతన్య ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.ఇక ఈ సినిమాకు నిర్మాత కూడా అమీర్ ఖాన్ కావడం విశేషం. ఇక ఇదిలా ఉంటె ఈ సినిమాలో నాగ చైతన్య పోషిస్తున్న పాత్రలో అమీర్ ఖాన్ మొదట నాని ని తీసుకోవాలని ఆయన్ని సంప్రదించగా..అప్పటికే నాని వేరే సినిమాలతో బిజీగా వుండటం.. 

డేట్స్ కూడా క్లాష్ అవ్వడంతో ఆ ఆఫర్ కి ఓకే చెప్పలేకపోయారు నాని.ఇక ఆ తర్వాత అక్కినేని హీరో నాగ చైతన్య ని ఆ పాత్ర కోసం ఎంపిక చేశారు. ఇక ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న లాల్ సింగ్ చద్దా సినిమా విడుదల తర్వాత కలెక్షన్స్ పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తే మాత్రం మన నాని ఫీలయ్యే అవకాశాలు ఉన్నాయి.ఇక అమీర్ ఖాన్ సినిమాలో నటిస్తే దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే చైతూ ఈ పాత్రలో నటించడానికి ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.ఇక అమీర్ ఖాన్ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమా మాత్రం  చైతూ కెరీర్లో మాంచి టర్నింగ్ పాయింట్..

 అవుతుందని భావిస్తున్నారు అభిమానులు.అంతేకాదు ఈ సినిమాతో మంచి గుర్తింపు అనేది వస్తే.. భవిష్యత్ లో బాలీవుడ్ లో నాగ చైతన్య వరుస అవకాశాలతో బిజీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.ఇక మరోసారి నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'లవ్ స్టోరీ' సెప్టెంబర్ 24 న విడుదల కానుంది. అసలైతే వినాయక చవితి సంధర్భంగా సెప్టెంబర్ 10 నే ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్న పలు అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇక వినాయక చవితి సంధర్భంగా ఈ సినిమా కొత్త విడుదల తేది సెప్టెంబర్ 24 అని అఫీషియల్ గా ప్రకటించింది చిత్ర యూనిట్.ఇక ఈ సినిమాతో పాటూ విక్రమ్ కె. కుమార్ డైరెక్షన్లో 'థాంక్యూ' అనే సినిమాలో నటిస్తున్నాడు చైతూ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: