ముందే రానున్న పుష్ప ... ??

GVK Writings
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తీస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా పుష్ప. గంధపు చెక్కల అక్రమ రవాణా నేపథ్యంలో సాగె మాస్ కమర్షియల్ డ్రామా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుండగా ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నటుడు ఫహద్ ఫాసిల్ విలన్ గా యాక్ట్ చేస్తున్న ఈ సినిమా మొత్తం రెండు భాగాలుగా రూపొందుతుండగా మొదటి భాగాన్ని ప్రస్తుతం వేగంగా షూట్ చేస్తోంది యూనిట్.
భారీ స్థాయి సాంకేతిక హంగులతో ఈ మూవీ నిర్మితం అవుతుండగా దీనిని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్, రవిశంకర్ రూపొందిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం ఈ సినిమా నుండి విడుదలైన ప్రీ లూడ్ టీజర్ తో పాటు గా ఇటీవల ఒకేసారి ఐదు భాషల్లో రిలీజ్ అయిన దాక్కో దాక్కో మేక సాంగ్ కూడా అందరినీ ఆకట్టుకుని పుష్ప పై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఏర్పరిచింది. ఇందులో పుష్ప రాజ్ అనే లారీ క్లీనర్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించనుండగా ఒక గిరిజన తండాకి చెందిన యువతిగా రష్మిక నటిస్తున్నట్లు టాక్. నిజానికి ఈ మూవి ని క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు.
అయితే లేటెస్ట్ గా పలు టాలీవుడ్ వర్గాల నుండి మాకు అందుతున్న న్యూస్ ని బట్టి ఈ సినిమాని మరొక వారం ముందుగా అనగా డిసెంబర్ 17 న రిలీజ్ చేసేలా యూనిట్ ఇప్పటికే డేట్ ఫిక్స్ చేసిందని, త్వరలో దీనిపై ఆఫీషియల్ గా ప్రకటన కూడా రానుందని అంటున్నారు. మరి ఇదే కనుక నిజం అయితే ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ కి మరొక వారం ముందే పండుగ వచ్చినట్లే అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: