టీఆర్పీ కోసమే .. ఆ రెండు .. భారీ షోస్ ..

Chandrasekhar Reddy
వెండితెరపై మెరుపులు మెరిపించి నటులు కార్పొరేట్ పుణ్యమా అంటూ బుల్లితెరపై కూడా వెలిగిపోతున్నారు. ఒకప్పటి నటులు తామ స్థాయికి తగ్గ పాత్రలు మాత్రమే చేస్తుండే వారు. మరేవిధమైన అవకాశం వచ్చినా తన అభిమానులు అలాంటివి ఆహ్వానించలేరనేది వారి అభిప్రాయం. కానీ కొన్నిసార్లు పరిస్థితులు అన్నిటికి సిద్ధం చేస్తాయి. అందుకే కొందరు అన్ని పాత్రలకు సిద్ధం అవుతారు. ఇలా అన్నిటిని స్వాగతించాలి అంటే వారు ప్రయోగాలకు సిద్ధం అయిఉండాలి. అలా ప్రయోగాలు చేసేవారు సినీ పరిశ్రమలో ఉన్నారు కాబట్టి అనేక మంది దర్శకులు వెండితెరకు పరిచయం అవుతున్నారు.
నటులు అనగానే వారికి ఒకస్థాయి విజయాలు రాగానే కొండెక్కి కూర్చుంటారు అనేది అభిప్రాయం. అలా కాకుండా ఉన్న వారు చాలా తక్కువ మంది, వీరు నచ్చితే అన్ని ప్రయోగాలకు సిద్ధం అవుతారు. అలా బుల్లితెరపై కూడా కనిపించి శబాష్ అనిపించుకున్నవారు ఉన్నారు. అలాంటి వారిలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఈయన బిగ్ బాస్ హోస్ట్ గా పరిచయం అయ్యారు, అందరిని మెప్పించారు. ఇక రెండో వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. వీరు కూడా బిగ్ బాస్ కు హోస్ట్ గా చేయడంతో పాటుగా ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్యక్రమానికి హోస్ట్ గా చేస్తున్నారు. బుల్లి తెర అనగానే టీఆర్పీ కోసం పరుగులు తీసే ఒక వ్యవస్థ. అక్కడ ఎంటర్టైన్మెంట్ సహా ఏ కార్యక్రమం రూపొందించినా అది ఎంతమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది అనేదే వారికి ముఖ్యం. అంటే ప్రేక్షకుల కలెక్షన్ ఫుల్ అయితే ఆయా షోస్ హిట్ లేదంటే ఫట్ అంతే.
ఇక వెండితెర తారలు బుల్లితెరకు పరిచయం చేయాల్సి వస్తే అందుకు ఆయా షోస్ కూడా ఆయా తరాల స్థాయికి తగ్గకుండా ఉండాలి కదా. కనీసం ఈ తారల అభిమానులు, బుల్లితెర అభిమానులు, సదరు కార్యక్రమం అభిమానులు వీరందరి సంఖ్య ఇక్కడ ముఖ్యం. దానితోనే కదా షో కు టీఆర్పీ ఎంత వచ్చిందో తెలుస్తుంది. అలా రూపొందినవే, బిగ్ బాస్ షో కానివ్వండి, ఎవరు మీలో కోటీశ్వరులు కానివ్వండి. ఈ షో లకు అనుకున్నంత టీఆర్పీ వస్తే ఆయా ఛానెళ్లకు అన్ని విధాలా ప్రయోజనం. వాటికోసమే ట్రెండ్ అవ్వడానికి ప్రత్యేకమైన సందర్భాలకు సృష్టించుకుంటూ, ఎప్పటికప్పుడు ఈ షో ల టీఆర్పీ తగినంత ఉండేట్టు చూసుకుంటారు. ఈ టీఆర్పీ పరుగు వలన బుల్లితెరపై కూడా విలువలు లేని కార్యక్రమాలు తయారు చేయబడుతున్నాయి, ప్రసారం చేయబడుతున్నాయి, చూడబడుతున్నాయి కూడా. ఆయా సంస్థల వాదన ప్రకారం, ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టే మేము అలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం అంటారు. ఇక ప్రేక్షకులు మంచి షో లు లేక ఏదో ఒకటి చూస్తున్నాం అంటున్నారు. వీళ్లు చూస్తున్నారని వాళ్ళు, వాళ్ళు చూస్తున్నారని వీళ్లు నిరుపయోగమైన కార్యక్రమాలు కాకుండా ఎంటర్టైన్మెంట్ అనే పదానికి అడ్డమైన అర్దాలు తీయకుండా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పైన చెప్పిన కార్యక్రమాలు మంచివి కావని అర్ధం కాదు, టీఆర్పీ పరుగులో విలువలు మరిచిపోవద్దని మనవి. వెండితెర విలువలు ఎప్పుడో దారితప్పాయి, అయినా ఆ తెరను అలంకరించే విధంగా అప్పుడప్పుడైనా కొన్ని మంచి చిత్రాలు ప్రదర్శితం అవుతూనే ఉన్నాయి. బుల్లితెర అలా కాకుండా విలువలతో కూడిన ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: