కొరటాల తో బాలయ్య చర్చలు...?

Sahithya
టాలీవుడ్ లో కొరటాల శివ కమర్షియల్ దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. కొరటాల శివ సినిమాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అగ్రహీరోలతో వరుసగా సినిమాలు చేయడమే కాకుండా వరుస విజయాలు నమోదు చేస్తూ ఇప్పుడు నిర్మాతలకు కూడా కొరటాల శివ వరంగా మారిపోయారు. ప్రస్తుతం కొరటాల శివ చేస్తున్న సినిమా చిరంజీవి తో. ఈ సినిమా తర్వాత ఆయన అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పుడు బాలకృష్ణ కూడా కొరటాల శివ తో ఒక కమర్షియల్ సినిమాలను నిర్మించడానికి సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది.
చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించడానికి బాలకృష్ణ ఆసక్తి చూపిస్తున్నారని అందుకే కొరటాల శివతో బాలకృష్ణ సంప్రదింపులు జరిపారని త్వరలోనే ఈ సినిమా ను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ నేపథ్యం కూడా ఈ సినిమాలో ఉంటుందని కృష్ణా నగర్ వర్గాలంటున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను అధికారికంగా ప్రకటించి 2023 సంక్రాంతి ఆ సినిమాను విడుదల చేయవచ్చు అనేది టాలీవుడ్ లో వినపడుతున్న మాట. మరి ఆ సినిమాను ఎప్పుడు ప్రకటిస్తారు ఏంటి అనేది తెలియాల్సి ఉంది.
కొరటాల శివ ప్రస్తుతం చిరంజీవి తో చేస్తున్న ఆచార్య సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇటీవల చిరంజీవి షూటింగ్ కూడా పూర్తికావడంతో ఇతర నటులతో సినిమా షూటింగ్ ని వేగంగా పూర్తి చేసే అవకాశం ఉందని సమాచారం. అలాగే మహేష్ బాబు తో కూడా కొరటాల శివ చర్చలు జరుపుతున్నారని ఒక సినిమాలో మహేష్ బాబు ఎప్పటినుంచి కొరటాల శివతో చేయడానికి కథ కూడా సిద్ధం చేసుకుని ఉంచారని కథను కొరటాల శివ మహేష్ బాబుకి శ్రీమంతుడు సినిమా సమయంలో ఇచ్చారని అంటున్నారు. మరి ఆ సినిమాను ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారు తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: