ఎని టైం యంగ్ టైగర్ నుండి కూడా ..... ??

GVK Writings
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుండి మూవీ రాక దాదాపుగా మూడేళ్లకు పైగా  అవడంతో ఆయన ఫ్యాన్స్ మూవీ కోసం ఎప్పటినుండో ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. చివరిగా త్రివిక్రమ్ తీసిన అరవింద సమేత మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్, ప్రస్తుతం చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నారు. రాజమౌళి తీస్తున్న ఈ పేట్రియాటిక్ మూవీ ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతామరాజుగా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం గా కనిపించనున్నారు.
స్వాతంత్రోద్యమ సమయానికి ముందు జరిగిన కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాని ఎంతో గ్రాండ్ లెవెల్లో రాజమౌళి తీస్తున్నట్లు టాక్. ఇక త్వరలో రిలీజ్ కానున్న ఈ మూవీ తరువాత వరుసగా సక్సెస్ లతో దూసుకెళ్తున్న దర్శకుడు కొరటాల శివ తో తన నెక్స్ట్ మూవీ చేయనున్నారు ఎన్టీఆర్. ఎంతో భారీగా రూపొందనున్న ఈ మూవీ కి యువ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీత దర్శకుడిగా ఫిక్స్ అయ్యారని, అలానే హీరోయిన్ గా పూజా హెగ్డే ఆల్మోస్ట్ ఫిక్స్ అని ఇన్నర్ వర్గాల టాక్.
మరోవైపు ఇప్పటికే ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక మొదలెట్టిన మేకర్స్, అతి త్వరలోనే ఈ మూవీ అధికారిక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సమాచారం. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలపై ఈ మూవీ రూపొందనుండగా మూవీ స్క్రిప్ట్ ని ఎంతో స్ట్రాంగ్ గా సిద్ధం చేశారట కొరటాల శివ. మరోవైపు ఆర్.ఆర్.ఆర్ చరణ్ తన నెక్స్ట్ మూవీని శంకర్ తో ప్రారంభించిన విషయం తెలిసిందే. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ కనుక నిజం అయితే త్వరలోనే ఎని టైం యంగ్ టైగర్ ఫ్యాన్స్ కి కూడా గుడ్ న్యూస్ బయటకు రావచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: