తాతయ్య ఆ విషయంలో చాలా కచ్చితంగా ఉంటాడంటున్నా ఎన్టీఆర్...!

murali krishna
హరికృష్ణ తన రెండవ భార్య షాలిని ముద్దుల కొడుకట ఎన్టీఆర్. అప్పటివరకు ఎన్టీఆర్ తల్లిని తమ కుటుంబంలో ఒక భాగంగా చేసుకోలేదట నందమూరి తారక రామారావు కుటుంబం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టడంతో నందమూరి తారక రామారావు గారు హరికృష్ణ రెండవ భార్య అయిన షాలినిని తమ కుటుంబంలోకి స్వీకరించడం జరిగిందని సమాచారం.
మనవడు పుట్టాడన్న ఆనందం తాతలో పొంగిపోయిందట.తన పేరు పెట్టి తన కంటే ఎక్కువ స్థాయిలో ఎదిగి పోవాలని ఆశీర్వదించాడని సమాచారం.అలా తాతకు తగ్గ మనవడిగా ఎదిగాడు ఎన్టీఆర్.తాతకు ఏమాత్రం తీసిపోకుండా నటనలో మరియు తెలివిలో తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడట యంగ్ టైగర్ ఎన్టీఆర్.
 
ఇకపోతే ఎన్టీఆర్ ఇటీవల తన తాతకు సంబంధించిన ఒక విషయం బయట పెట్టడం జరిగిందని తెలుస్తుంది. నటన పట్ల తన తాత సీనియర్ ఎన్టీఆర్ కు ఎంత డెడికేషన్ ఉండేదో అదే విషయాన్ని చెప్పుకొచ్చారట మనవడు జూనియర్ ఎన్టీఆర్. ఒకసారి ఒక సినిమా చిత్రీకరణ సమయంలో ఒక బెత్తంతో ఆయన తొడపై ఆయనే గట్టిగా కొట్టుకోవలసి వచ్చిందని తెలిపాడని సమాచారం . అయితే అప్పటికే ఒక షాట్ రెండు మూడు సార్లు టేక్ అప్ చేయడం జరిగిందని సమాచారం. డైరెక్టర్ కూడా ఓకే చెప్పారని తెలుస్తుంది.కానీ ఆ సీన్ చూసిన తర్వాత తాత ఎన్టీఆర్ కు మాత్రం సంతృప్తి కలగలేదని సమాచారం తిరిగి తర్వాత రోజు అదే సీన్ చిత్రీకరించాలని డైరెక్టర్ తో చెప్పాడట. ఎన్టీఆర్ మాటను గౌరవించి ఆ డైరెక్టర్ కూడా ఒప్పుకున్నారని సమాచారం..
 
ఆ తర్వాత మొదటి షాట్ లోనే ఆ సీన్ ఓకే చేశారు అంటూ చెప్పుకొచ్చారు. తాత ఆ సీన్ మళ్లీ ఎందుకు చేయించారు అంటే, ఆ సీన్ లో ముఖంలో కాస్త ఎక్స్ప్రెషన్ మిస్సయింది అని అనిపించడం వల్లే , అలా చేయించారని , ఆ తర్వాత రోజు సినిమా షూటింగ్ లో గట్టిగా తొడపై కొట్టుకోవడం తో పూర్తిగా వాతలు పడి, చర్మం కమిలిపోయింది అంటూ చెప్పుకొచ్చారు. ఆ ఒక్క ఘటనతో తాతగారికి నటనపై ఎంత డెడికేషన్ ఉండేదో అర్థమైంది అంటూ చెప్పుకొచ్చారు జూనియర్ ఎన్టీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: