త్రివిక్రమ్ కి అదే పెద్ద తలనొప్పిగా మారిందట..?

Anilkumar
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అనగానే ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు.అయితే ఇప్పుడు ఫ్యాన్స్ ని సంతృప్తి పరచడానికి త్రివిక్రమ్ అన్ని విధాలుగా ఆలోచించాల్సి వస్తోంది.ముఖ్యంగా మహేష్ సినిమాకి నటీ నటులను ఎంపిక చేయడం ఇప్పుడు త్రివిక్రమ్ కి పెద్ద తలనొప్పిగా మారిందట.ఒక పక్క అల్లు అర్జున్ పుష్ప సినిమాలో బాలీవుడ్ నటులు, అలాగే మలయాళ ఇండ్రస్టీకి చెందిన నటులు నటిస్తున్నారు.అలాంటి మహేష్ సినిమాలో కూడా పాన్ ఇండియా స్టార్స్ లేకపోతే బాగోదని డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పటినుంచే  త్రివిక్రమ్ పై ఒత్తిడి పెంచుతున్నారట.ఇక అటు మహేష్ వైపు నుంచి కూడా బాలీవుడ్ స్టార్ కాస్ట్ ను తీసుకోమని మెసేజ్ వచ్చిందట.

కానీ బాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న ఏ నటుడు ప్రస్తుతం వరుసగా పది రోజులు డేట్స్ ఇచ్చే పరిస్థితుల్లో లేడట.సంజయ్ దత్ నుంచి సునీల్ శెట్టి వరకు అందరూ ఫుల్ బిజీగా ఉన్నారని త్రివిక్రమ్ కి సమాధానాలు వచ్చాయి.దాంతో త్రివిక్రమ్ కి ఈ నటీ నటుల ఎంపిక అనేది పెద్ద తలనొప్పి అయిపోయింది.ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ సినిమా స్క్రిప్ట్ పనుల్లో ఫుల్ బిజీగా వున్నాడు.మరోపక్క పాత్రలకు తగ్గట్టు నటి నటులను ఎంపిక చేస్తున్నాడు.ఇక ఇప్పటికే చిన్నా చితక నటులను సెలెక్ట్ చేసాడు.ఇంకా కీలక పాత్రల కోసం స్టార్ నటులను ఎంపిక చేయాల్సి ఉంది.ఇక ఈ సినిమాని పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో సాగే ఓ భారీ యాక్షన్ సినిమాగా తీయాలని ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్.ముఖ్యంగా నేటి రాజకీయాలను కూడా ఈ సినిమాలో త్రివిక్రమ్ చూపించబోతున్నాడని అంటున్నారు.

ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఢిల్లీలోని భిన్నమైన రాజకీయ నేపథ్యం ఎంచుకున్నారని,అలాగే పల్నాటి ప్రాంతానికి చెందిన నేపథ్యాన్ని కూడా చూపించనున్నాడట.అంతేకాకుండా ఓ సామాజిక అంశాన్ని కూడా సినిమాలో ప్రముఖంగా ప్రస్తావించబోతున్నట్లు తెలుస్తోంది.ఇక సినిమాలో మహేష్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నారని,అందులో ఒక హీరోయిన్ గా బుట్టబొమ్మ పూజా హెగ్డేను ఫైనల్ చేశారు.ఇక మరో హీరోయిన్ ని ఇంకా ఎంపిక చేయాల్సి ఉంది.హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక అక్టోబర్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకోనున్నట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: