మెగాస్టార్ కి పర్ఫెక్ట్ కంబ్యాక్... "ఖైదీ నంబర్ 150"

VAMSI
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వివిధ కారణాలతో దాదాపుగా 9 సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. దీనితో మెగా భిమానులు పిచ్చెక్కిపోయారు. అలా ఈ మధ్యలో వచ్చిన గ్యాప్ ను పూడ్చడానికి ఖైదీ నెంబర్ 150 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మెగాస్టార్. ఈ చిత్రంతో మళ్ళీ యూజ్ ఏజ్ లో ఉన్న చిరంజీవిని ప్రేక్షకులు చూడగలిగారు. తన బాడీ లాంగ్వేజ్, స్టైల్ డాన్స్ అన్నీ మారిపోయాయి. సరికొత్తగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా గురించి మనకు తెలియని కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఈ సినిమా టైటిల్ ను చిరంజీవి కెరీర్ కి తగ్గట్టే ప్లాన్ చేశారు. అంటే రీ ఎంట్రీ ఘనంగా ఉండాలని తన కెరీర్ లో వచ్చి బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన ఖైదీ మరియు ఖైదీ 786 లను ఆధారంగా చేసుకుని టైటిల్ ను ఖైదీ నెంబర్ 150 గా పెట్టారు.
మెగా అభిమానులు టైటిల్ తోనే ప్లాట్ అయిపోయారు. పైగా ఈ సినిమా చిరంజీవి కెరీర్ లో 150 వ చిత్రం కావడం విశేషం.  ఈ సినిమా తమిళ్ మూవీ కత్తికి రీమేక్ కావడం విశేషం. తమిళ్ లో విజయ్ మరియు సమంత జంటగా నటించారు.  ఈ కథ రైతులకు సంబంధించినది కావడంతో వెంటనే చేయడానికి ఒప్పుకున్నాడట చిరు. ఇందులో మెగాస్టార్ డబుల్ రోల్ లో నటించగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా అదరగొట్టింది. మురుగదాస్ అందించిన కథ చాలా ఎస్సెట్ అని చెప్పాలి. ప్రస్తుత సమస్యను తీసుకుని అల్లిన కథనం హైలైట్ అని చెప్పాలి.
ఈ సినిమాకు మొత్తం నలుగురు రచయితలు కథను అందించారు. వారిలో సీనియర్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్, సాయిమాధవ్ బుర్రా, వేమా రెడ్డి లు ఉన్నారు. ఈ సినిమాలో ఉన్న అన్ని పాటలు దేనికదే ప్రత్యేకం. ఈ పాటలకు చిరంజీవి స్టెప్పులు మరింత అదిరిపోయాయి. ఈ సినిమాలో అమ్మడు "లెట్స్ డు కుమ్ముడు" అనే పాట చాలా పాపులార్ అయింది. మెగాస్టార్ కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో డైరెక్టర్ వినాయక్ కథను చెప్పిన తీరు ప్రతి ఒక్క ప్రేక్షకుడికి టచ్ అయింది. రైతుల సెంటిమెంట్ అనే హృద్యమైన కథను తెరపై చూస్తుంటే కళ్ళ వెంట నీరు ఆగలేదంటే నమ్మండి. ఇందులో చిరంజీవి మాస్ నటన హైలైట్ అని చెప్పాలి. కేవలం 50 కోట్లతో తెరకెక్కిన ఖైదీ 150 టోటల్ రన్ లో 163 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తానికి చిరంజీవి ఎంట్రీకి పర్ఫెక్ట్ కథ యాక్షన్ ఎంటర్టైనర్ పడింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: