తార‌క్‌తో ఉప్పెన డైరెక్ట‌ర్ బుచ్చిబాబు?

Dabbeda Mohan Babu
ఉప్పెన వంటి హిట్‌ సిన‌మాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు పెట్టిన డైరెక్ట‌ర్ బుచ్చిబాబు. ఈ సినిమా తో మొద‌టి సారి హిరో హిరోయిన్‌గా చేసిన మెగా హిరో వైష్ణ‌వ్ తేజ్, కృతిశెట్టి మంచి పేరు తెచ్చ‌కున్నారు. ఈ సినిమా త‌ర్వాత మెగా హిరో వైష్ణ‌వ్ తేజ్ వ‌రుస సినిమాల‌తో బిజీ గా ఉన్నాడు. కృతిశెట్టి కూడా టాలీవుడ్ లోనే లీడింగ్ హిరోయిన్ గా ఉంటుంది. ఈ అమ్మ‌డు డేట్ల కోసం చాలా మంది నిర్మాత‌లు లైన్లు కుడుతున్నారు. ఇంతా పెద్ద హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు ప్ర‌స్తుతం చేతిలో సినిమాలు లేక ఉంటున్నాడ‌ని ప‌లువురు అనుకున్నారు. కానీ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో సినిమా చేయ‌బోతున్నాడ‌ని తెలుగు చిత్ర సీమ కోడై కూస్తోంది.

డైరెక్ట‌ర్ బుచ్చిబాబు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కోసం మంచి క‌థ రెడి చేశాడ‌ని దానికి ఎన్టీఆర్ ఓకే అని అన్నార‌ని చాలా కాలంగా ప్ర‌చారం సాగుతోంది. అయితే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ తో చేస్తున్న మ‌ల్టీ స్టార‌ర్ సినిమా ఆర్ ఆర్ ఆర్‌తో బిజీ గా ఉన్నాడు.  ఈ సినిమా త‌ర్వాత కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శంత్ నీల్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా కోసం అన్ని రెడీగా ఉన్నాయ‌ని, ఆర్ ఆర్ ఆర్ సినిమా అయిన వెంట‌నే ప్ర‌శంత్ నీల్ కాంబోలో వ‌స్తున్న సినిమాకు షెడ్యూల్ ఇచ్చార‌ని స‌మాచారం.

అయితే యంగ్ టైగ‌ర్ ఎంత బిజీగా ఉన్నా ఎన్ని సినిమాలు చేస్తున్నా బుచ్చిబాబు సినిమా కోసం డెట్స్ ఇవ్వ‌నున్న‌ట్టు తెలుస్తోంది. అన్ని కుదిరితే వ‌చ్చే సంవ‌త్స‌రం జులై నుంచి షూటింగ్ ప్రారంభం కానుంద‌ని టాలీవుడ్ లో వినిపిస్తోంది. ఈ సినిమాలో తార‌క్ ను బుచ్చిబాబు స్పోర్ట్స్ మెన్‌గా చూపించ‌నున్న‌డ‌ట‌. ఇది తెలుగు వ‌ర్ష‌న్ దంగ‌ల్ గా ఉండ‌నుంద‌ని తెలుస్తోంది. వీరి కాంబోలో వచ్చే ఈ సినిమా కోసం తారక్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: