ఎన్టీఆర్ కొరటాల సినిమా టైటిల్ అదేనా...?

murali krishna
యంగ్ టైగర్  ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న విషయం అందరికి తెలిసిందే. నవంబర్ రెండవ వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయని తెలుస్తుంది.
చిత్ర పరిశ్రమ వర్గాల్లో ఈ సినిమాకు డైమండ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారని వార్త వినిపిస్తోందని తెలుస్తుంది. పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయని తెలుస్తుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారని సమాచారం..
పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుండగా డైమండ్ టైటిల్ బాగుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం అభిప్రాయపడుతున్నారని సమాచారం. జనతా గ్యారేజ్ సినిమాతో ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో బ్లాక్ బస్టర్ హిట్ సాధించగా త్వరలో తెరకెక్కబోయే సినిమాతో ఎన్టీఆర్ ఖాతాలో ఇండస్ట్రీ హిట్ చేరుతుందని తారక్ ఫ్యాన్స్ భావిస్తున్నారని తెలుస్తుంది. త్వరలోనే ఎన్టీఆర్ 30వ సినిమా టైటిల్ కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అలాగే అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారని సమాచారం అందింది.
 
కొరటాల శివ ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారని తెలుస్తుంది. ఇటీవలే ఆర్ఆర్ఆర్ మూవీని పూర్తి చేసిన ఎన్టీఆర్ తరువాత సినిమాలను వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారని తెలుస్తుంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ఎవరు మీలో కోటీశ్వరులు షో తో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.కొరటాల శివ ఆచార్య సినిమా పనులతో బిజీగా ఉండటంతో ఈ సినిమా పనులు ఆలస్యమవుతున్నాయని తెలుస్తుంది.ఆచార్య సినిమా దాదాపు పూర్తి అయిందని సమాచారం. ఈ దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనీ భావించిన అది సాధ్యం కాలేదని సమాచారం. మరి ఆచార్య సినిమా ఎప్పుడు విడుదలవుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: