ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ కి మళ్ళీ నిరాశనే మిగిల్చిన రాజమౌళి..?

Anilkumar
టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా హీరో రామ్ చరణ్, నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారి కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'రౌద్రం రణం, రుధిరం'.చరిత్రలో కలవని ఇద్దరు స్వతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ కలసి స్వాతంత్రం కోసం పోరాటం చేస్తే ఏ విధంగా ఉంటుందనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది.అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నారు. సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ తో దానయ్య ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని అక్టోబర్ 13 దసరా కానుకగా విడుదల చేస్తామని రాజమౌళి చెప్పినా...

ఆ తేదీకి సినిమా రిలీజయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు.ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ల వలన ఆర్ ఆర్ ఆర్ మూవీపై అంచనాలను తారాస్థాయికి చేర్చారు రాజమౌళి.అయితే వినాయక చవితి సంధర్భంగా ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందని భావించారు అభిమానులు.కానీ ఈసారి కూడా అభిమానులకు నిరాశ తప్పదని తెలుస్తోంది.వినాయక చవితికి ఆర్ ఆర్ ఆర్ నుంచి ఎలాంటి అప్డేట్ ఉండదని,త్వరలోనే ఆర్ ఆర్ ఆర్ మేకర్స్ ఓ ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ డేట్ వాయిదాకు సంబంధించిన ప్రకటన చేస్తారని సమాచారం అందుతోంది.మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన పబ్లిసిటీ విషయంలో రాజమౌళి సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదనే వాదనలు..

 కూడా వినిపిస్తున్నాయి.ఇంకా మరికొందరు జక్కన్న ఇలా చేయడం ఏమైనా బాగుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.అయితే నిజానికి ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ ని ఈ మధ్యే మొదలు పెట్టింది చిత్ర యూనిట్. ఆ ప్రమోషన్స్ లో భాగంగానే ఓ పాటని విడుదల చేసారు. ఆ తర్వాత ఉక్రెయిన్ షెడ్యూల్ కి సంబంధించి వరుస అప్డేట్స్ ని రిలీజ్ చేశారు. అదే విధంగా వినాయక చవితి పండుగకి కూడా ఏమైనా అప్డేట్ ఉంటుందని అందరూ భావించగా... జక్కన్న మాత్రం చరణ్, తారక్ ఫ్యాన్స్ కి నిరాశే మిగిల్చాడు.ఇక కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్,శ్రీయ శరన్ అలియా భట్, ఒలివియా మోరీస్, సముద్ర ఖని,రే స్టీవెన్ సన్, అలిసన్ డూడీ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు.ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది సంక్రాంతి కి ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: