బాలయ్యకు భానుమతి ఇచ్చిన అద్భుత బహుమానం... ?

Satya
భానుమతి అలనాటి నటీమణి. ఆమె ఎన్టీయార్ ఏయన్నార్ ల కంటే కూడా సీనియర్. తెలుగు చిత్ర సీమలో ఆమె లాంటి నటీమణి బహుముఖ ప్రతిభాశాలి మరొకరు రాబోరు. భానుమతి చిత్ర సీమను తన టాలెంట్ తో శాసించారు. ఆమె నచ్చినట్లుగానే ఉన్నారు. ఆమెకు లౌక్యం తెలియదు. ఉన్న మాట ముఖం మీద అంటారు. అలా ఉన్నదే చెప్పి కుండబద్ధలు కొడతారు.
ఇదిలా ఉంటే నందమూరి నట వారసుడు బాలయ్యకు భానుమతికి మధ్య అందమైన అనుబంధం ఉంది. బాలయ్య ఫస్ట్ మూవీ తాతమ్మ కళ 1974లో రిలీజ్ అయింది. ఈ మూవీలో బాలయ్యకు తాతమ్మగా భానుమతి నటించారు. తిరిగి పదేళ్ల తరువాత అంటే 1984లో ఆమె మంగమ్మగారి మనవడు మూవీలో బాలయ్యతో నటించారు. ఈ మూవీలో ఆమె పాత్ర హైలెట్.
చిత్రం టైటిల్ కూడా ఆమె మీదనే ఉంటుంది. మొత్తం కధ అంతా ఆమె చుట్టూనే తిరుగుతుంది. బాలయ్య సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చాక సరైన హిట్ లేదు. ఆ టైమ్ లో వచ్చిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవడమే కాదు, పాత రికార్డులు తిరగరాసింది. దానికి కారణం భాముమతి నటన అని అంతా అంటారు. ఈ సినిమాకు మూల స్థంభంగా భానుమతి నిలబడి చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యేలా చూశారు అని చెబుతారు. ఈ మూవీ ఆమె మొదట ఒప్పుకోలేదుట. ఆ తరువాత కధ వినడమే కాదు, బాలక్రిష్ణ హీరో అని తెలిసి నందమూరి నట వారసుడిని ప్రోత్సహించడానికి ఓకే అనేశారుట. అలా బాలయ్యకు మరపురాని సూపర్ హిట్ ఇచ్చి అద్భుతమైన బహుమతినే భానుమతి ఇచ్చారనుకోవాలి. బాలయ్య అంటేనే కాదు, నందమూరి కుటుంబం అన్నా కూడా భానుమతి ఎంతో అభిమానపడేవారు. ఎన్టీయార్ కూడా ఆమెను సొంత మనిషిగా భావించేవారు. ఈ విధంగా ఆ కుటుంబంతో ఆమె అనుబంధం బహు చక్కగా కొనసాగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: