సమంత చెంతకుచేరిన జయలలిత చీరలు !

Seetha Sailaja

ప్రస్థుతం ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా నడుస్తోంది. ఈనేపధ్యంలో ఈవారంలో విడుదలకాబోతున్న ‘తలైవి’ మూవీ ఫలితం గురించి ఇండస్ట్రీ వర్గాలు ముఖ్యంగా కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు చాల ఆశక్తిగా ఎదురు చూస్తున్నాయి. సినిమా హీరోయిన్ గా తమిళనాడు ముఖ్యమంత్రిగా తమిళ ప్రజలలో శాశ్విత స్థానాన్ని ఏర్పరుచుకున్న జయలలిత జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు మరెన్నో చీకటికోణాలు ఉన్నాయి.

ఇలాంటి విషయాలను యదార్థంగా చూపెడితే తమిళ ప్రజలు ముఖ్యంగా జయలలిత అభిమానులు ఊరుకోరు. అసలు ఏమి చూపెట్టకుండా ఉంటే ఈమూవీ ఒక డాక్యుమెంటరీ లా మారే ప్రమాదం ఉంది. దీనితో ఈమూవీ దర్శకుడు విజయ్ ఈమూవీని ఎలా డీల్ చేసాడు ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈమూవీకి సమకూర్చిన కథలో నిజాలు చెప్పే సాహసం చేయగలడా అన్నసందేహాలు చాలామందికి ఉండటంతో ఈమూవీ విడుదలకోసం అందరూ ఎదురు చూస్తున్నారు.

ఈమూవీలో జయలలిత పాత్రలో నటించిన కంగనా రనౌత్ ఈమూవీ కోసం చాల కష్టపడినట్లు తెలుస్తోంది. జయలలిత నడక ఆమె హావభావాలు బాడీ లాంగ్వేజ్ ఇలా ప్రతి చిన్న విషయంలోనూ కంగన జయలలిత గురించి చాలలోతుగా తెలుసుకుంది అని ఈమూవీని ఇప్పటికే చూసిన కొందరు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. దేశరాజకీయాలను ప్రభావితం చేసే జయలలిత కట్టు బొట్టు మాట్లాడే విధానం అన్నీ ప్రత్యేకం. ఆమె ఎక్కువగా కాంచీపురం చీరలనే ధరించేవారు. నాయకురాలిగా సమావేశాలకు హాజరవ్వాలంటే ఖచ్చితంగా కాంచీపురం చీరలే  ధరించి వెళ్లేవారు. ఆ చీరల ఔన్నత్యాన్ని ఆ రకంగా జయలలిత అప్పట్లో చాటి చెప్పేవారు అని అంటారు.


ఈసినిమా దర్శకుడు ఈమూవీలో కూడ వాస్తవికత ఎక్కడా తప్పకుండ అవ్వకుండా కంగన జయలలిత పాత్రకు కాంచీపురం చీరలనే వాడినట్లు తెలుస్తోంది. ఈసినిమా ప్రమోషన్ కోసం ఈమధ్య కంగన చెన్నై వచ్చినప్పుడు ఆ చీరలు అన్నీ ఆమెకు ఇస్తే ఇన్ని చీరలు తాను ఏమిచేసుకుంటాను అంటూ ఆమెకు గుర్తు గా మరో ప్రముఖ హీరోయిన్ కు కూడ పంపమని చెప్పిందట. దీనితో ఆమూవీ నిర్మాతలు జయలలిత మెచ్చిన స్పెషల్ కాంచీపురం చీరల్ని సమంతకు తలైవి నిర్మాతలు కానుకగా పంపించారు అన్న వార్తలు వస్తున్నాయి. గోల్డ్ కలర్ బాక్స్ లో కాంచీపురం ఎరుపు వర్ణం చీరల్ని ప్యాక్ చేసి నేరుగా సమంత ఇంటికి పంపించారట. దీనితో ఈ అనుకోని గిఫ్ట్ ను సమంత అపురూపంగా చూసుకుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: