విజయ్ దేవరకొండ తో సినిమా గురించి స్పందించిన క్రేజీ దర్శకుడు..!

Pulgam Srinivas
సినిమాలకు దర్శకత్వం వహించడం లో ఒక్కొక్కరికి ఒక్కో పద్ధతి. ప్రస్తుతం ఉన్న కొత్త దర్శకులు నూతనంగా ఆలోచిస్తూ కొత్త కొత్త ఆలోచనలతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అలా కొత్త ఆలోచనలతో సినిమాలను నిర్మించి , మంచి విజయాలను సాధించిన నూతన దర్శకుల్లో శివ నిర్వాణ ఒకరు. ఈ దర్శకుడు నాని హీరోగా నివేదాథామస్ హీరోయిన్ గా తెరకెక్కిన 'నిన్ను కోరి' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో ఒక మంచి ప్రేమ కథను వెండితెరపై ఆవిష్కరించి దర్శకుడు అటు సినిమా ప్రేక్షకులతో పాటు, ఇటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందాడు. ఆ తర్వాత నాగచైతన్య హీరోగా సమంత హీరోయిన్ గా 'మజిలీ'  సినిమాను తెరకెక్కించి , ఒక మంచి ప్రేమ కథను వెండితెరపై చాలా సున్నితంగా తెరకెక్కించి రెండోసారి కూడా విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం మూడో సినిమా 'టక్ జగదీష్' తో దర్శకుడు శివ నిర్వాణ ప్రేక్షకుల ముందుకు తన చిత్రంతో రానున్నాడు. ఈ సినిమా ఎన్నో సార్లు థియేటర్లలో విడుదల చేయాలి అనుకున్న కరోనా పరిస్థితులవల్ల థియేటర్ లలో విడుదల చేయలేక పోయారు. చివరగా ఎన్నో పరిస్థితులను ఎదుర్కొని ఈ సినిమా సెప్టెంబర్ 10వ తేదీన వినాయక చవితి సందర్భంగా ప్రముఖ 'ఓటిటి' అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్మింగ్ కానుంది. ఆ సందర్భంగా దర్శకుడు సినిమా గురించి ఎన్నో విషయాలను తెలియజేశాడు.

సినిమాను మొదట థియేటర్లోనే విడుదల చేయాలి అనుకున్నాము , కాకపోతే పరిస్థితులు అనుకూలించక 'ఓటిటి' లో విడుదల చేయవలసి వస్తుంది అని దర్శకుడు శివ నిర్వాణ తెలియజేశాడు. అలాగే విజయ్ దేవరకొండ  సినిమా గురించి మాట్లాడుతూ , నేను విజయ్ దేవరకొండ తో సినిమా చేస్తాను అని అప్పట్లో ప్రకటించాను, ఆ సినిమా ఆగిపోలేదు త్వరలోనే సెట్స్ పైకి వెళుతుంది అంటూ దర్శకుడు శివ నిర్వాణ తెలియజేశాడు. ఇలా దర్శకుడు శివ నిర్వాణ, విజయ్ దేవరకొండ సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: