రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..!

Pulgam Srinivas
రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఒలీవియా మోరీస్, అలియా భట్ హీరోయిన్లుగా సముద్రకని ,అజయ్ దేవగన్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ఆర్ఆర్ఆర్'.ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతుండగా , జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో కనిపించబోతున్నాడు.

 ఇప్పటికే ఈ ఇద్దరు హీరోలు ఈ సినిమాలో పోషించబోయే పాత్రలకు సంబంధించిన ప్రోమో లను కూడా చిత్రబృందం విడుదల చేయగా వీటికి జనాల మంచి స్పందన కూడా దక్కింది. ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 13వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అఫిషియల్ గా అనౌన్స్ చేసింది. అయితే ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడటంతో ఇప్పటికే ప్రమోషన్ లో భాగంగా 'దోస్తీ' అనే ఒక ప్రమోషన్ సాంగ్ ను కూడా చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాటకు కూడా జనాలు నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే 'ఆర్ఆర్ఆర్' చిత్రబృందం మరొక ప్రమోషనల్ వీడియో కూడా ప్లాన్ చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా నుండి ఏదైనా ఒక అప్డేట్ వస్తుంది అని రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చాలా ఆతృతతో ఎదురు చూశారు.
 దానికి ప్రధాన కారణం ఇతర హీరోల సినిమాలకు సంబంధించిన అనేక అప్డేట్లు ఆరోజు వస్తున్నట్లు వార్తలు రావడమే. కాకపోతే ప్రస్తుతం తెలుస్తున్న విషయం ప్రకారం 'ఆర్ఆర్ఆర్' సినిమా నుండి వినాయక చవితి సందర్భంగా ఎలాంటి అప్డేట్ వచ్చే అవకాశం లేదు అని ఫిల్మి దునియా లో వార్తలు వినపడుతున్నాయి. ఈ వార్తలతో రామ్ చరణ్ , ఎన్టీఆర్ అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: