సమంత సైడ్ ఇన్ కమ్ అన్ని కోట్లా!!

P.Nishanth Kumar
ఏ మాయ చేసావే చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సమంత అక్కినేని నాగచైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకొని అక్కినేని వారి కోడలిగా పెత్తనం చెలాయిస్తుంది. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈమె హీరోలకు సమానంగా మార్కెట్ ను ఏర్పరచుకొని ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి చాలా సంవత్సరాలు గడుస్తున్నా ఆమె క్రేజ్ భారీగానే ఉంది.  ప్రస్తుతం అగ్ర హీరోలతో సినిమాలు చేయక పోయినప్పటికీ ఆమె మార్కెట్ కు వచ్చిన ఢోకా ఏమీ లేదనే చెప్పాలి.

ఆమె నటించిన లేడి ఓరియెంటెడ్ చిత్రాలు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటున్నాయి.  ఆమె ఆ మధ్య చేసిన ఓ బేబీ సినిమా ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా తర్వాత సమంత కూడా భారీగానే రెమ్యునరేషన్ పెంచింది. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా చేస్తోంది. దానికి సంబంధించిన సినిమా షూటింగ్ కూడా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దం అవుతుంది. ఈ నేపథ్యంలో ఆమె బాలీవుడ్లో మరిన్ని ఆఫర్స్ అందుకోవడానికి సన్నాహాలు చేస్తుంది. 

ఇదిలా ఉంటే ఆమెకు సినిమాల ద్వారా వచ్చే డబ్బు కంటే ఇతర వ్యాపకాల ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువ అని తెలుస్తుంది. ఆమె ఒక్కో సినిమాకు ఎంత పారితోషకం తీసుకుంటుంది అనే విషయాన్ని పక్కన పెడితే సోషల్ మీడియా ద్వారా ఆమె భారీ ఆదాయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని బ్రాండెడ్ దుస్తుల కోసం గానీ బ్యాంకుల కోసం గానీ ఫోటో షూట్ లో పాల్గొంటున్న సమంత గంట కంటే ఎక్కువ సమయాన్ని వెచ్చించడం లేదు. రెమ్యునరేషన్ మాత్రం లక్షల్లోనే తీసుకుంటుంది. తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ కి గాను 7 నుంచి పదిహేను లక్షల దాకా ఆమె ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇంస్టాగ్రామ్ స్టోరీకి 70% వసూలు చేస్తోందట. ఆమె అతి తక్కువ కాలంలోనే నెలకు కోటిన్నర ఆదాయాన్ని అందుకుంటున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: