రామ్ చరణ్ సినిమా కోసం ఆ ప్రయత్నం చేసిన దర్శకుడు శంకర్..!

Pulgam Srinivas
రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా తో వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనుండగా ఎన్టీఆర్ ఈ సినిమాలో కొమురంభీం పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ ఇద్దరి పాత్రలకు సంబంధించిన ప్రోమో లను కూడా చిత్రబృందం విడుదల చేయగా వాటికి జనాలు నుండి మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 13వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఇలా 'ఆర్ఆర్ఆర్'  సినిమా పనులు దాదాపు ముగియడంతో రామ్ చరణ్ తన తదుపరి చిత్రం మీద ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటికే స్టార్ దర్శకుడు శంకర్, దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తూ తెరకెక్కబోయే సినిమాలో రామ్ చరణ్ నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

 అయితే ఈ సినిమా పూజా కార్యక్రమం రేపు అనగా సెప్టెంబర్ 8వ తేదీన ప్రారంభించబోతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటించనుంది. రేపు జరగబోయే పూజా కార్యక్రమం కోసం నేటి ఉదయమే కియారా అద్వానీ ముంబై నుండి హైదరాబాద్ కి చేరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బలమైన స్క్రిప్ట్ ను రెడీ చేసి పెట్టుకున్న దర్శకుడు శంకర్. రామ్ చరణ్, కియారా అద్వాని లపై టెస్టు షూట్ జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. దర్శకుడు శంకర్, రామ్ చరణ్, కియారా అద్వానీ ల లుక్ ఎలా ఉండాలి.. అనే విషయమై ఈ టెస్ట్ షూట్ జరిపినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: