రీమేక్ అయినా.. చిరు సినిమా ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్?

praveen
ఈ మధ్యకాలంలో చాలా మటుకు తెలుగు స్టార్ హీరోలు.. తమ రీ ఎంట్రీ  సినిమాలకు కొత్త కథల కంటే అటు ఆల్రెడీ ఇతర భాషల్లో విజయం సాధించిన కథలపైన ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.  ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ కూడా రీమేక్ సినిమానే కావడం గమనార్హం. హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పింక్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఈ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది వకీల్ సాబ్ . అయితే కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఇక పవన్ కళ్యాణ్ క్రేజ్ కి తగ్గట్లుగా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు.  అచ్చం ఇలాగే కొన్ని సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి సినిమా ఖైదీ నెంబర్ 150 కూడా తమిళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన సూపర్ డూపర్ హిట్ సాధించింది.

 తమిళంలో ప్రస్తుతం సూపర్ స్టార్ గా కొనసాగుతున్న ఇళయ దళపతి విజయ్ సమంత జంటగా నటించిన కత్తి సినిమా ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ సినిమా విజయ్ కి కెరియర్ ని కీలక మలుపు తిప్పింది. అయితే  ఇక మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన సమయంలో ఇక ఈ సినిమా రీమేక్ చేయాలని భావించారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి క్రేజ్ కి తగ్గట్లు కొన్ని మార్పులు చేర్పులు చేశారు.  రీమేక్ సినిమా కావడంతో ఈ సినిమా హిట్ అవుతుందో లేదో అని ఎంతో మంది భావించారు. కానీ ఊహించని విధంగా సూపర్ డూపర్ హిట్ అయింది.

 కొన్నేళ్ల పాటు చిత్ర పరిశ్రమకు దూరమైనప్పటికీ  చిరంజీవి గ్రేస్ ఎక్కడా తగ్గలేదు అని ఈ సినిమాతో మళ్లీ ప్రూవ్ అయ్యింది. సినిమాలో చిరంజీవి డాన్స్ లు తనదైన యాక్టింగ్ కామెడీ టైమింగ్ కి మళ్ళీ ప్రేక్షకులందరూ ఫిదా అయిపోయారు. చిరంజీవి సరసన ఖైదీ నెంబర్ 150 సినిమాలో  కాజల్ అగర్వాల్ నటించింది. ఈ సినిమాను అటు చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇక ఎన్నో ఏళ్ల నుంచి చిరంజీవి రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న మెగా అభిమానులందరికీ ఖైదీ నెంబర్150 సినిమా ఫుల్ మీల్స్ అందించింది అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: