సమంత- రామ్ చరణ్ లిప్ లాక్ వెనుక ఇంత కథ జరిగిందా..?

Divya
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సమంత కలిసి నటించిన చిత్రం అనగానే ముందుగా గుర్తొచ్చే చిత్రం రంగస్థలం.. ఈ సినిమా రామ్ చరణ్ సినీ జీవితంలో ఒక మైలురాయి అని చెప్పవచ్చు. మొదటిసారి చెవిటివాడి పాత్రలో రామ్ చరణ్ నటించిన పల్లెటూరి అమ్మాయి పాత్రలో సమంత నటించి, ఈ సినిమాకు హైలెట్ గా నిలిచారు. ముఖ్యంగా చెప్పాలంటే జగపతిబాబు ప్రతినాయకుడిగా మాత్రం ప్రతి ఒక్కరికీ భయం పుట్టించాడు. ప్రకాష్ రాజు ముందునుంచి నమ్మించి చివర్లో మోసం చేయడం, ఆ తర్వాత పక్షవాతం వచ్చి మంచంలోనే పడిపోవడంతో.. తను కోలుకునే వరకూ సపర్యలు చేసి ప్రకాష్ రాజుకు నయం అయిన తర్వాత ప్రకాష్ రాజ్ చూస్తుండగానే ప్రకాష్ రాజ్ ని రామ్ చరణ్ గొంతు కోయడం ఈ సినిమాకు హైలెట్..

ఇలా ప్రతి పాత్రా కూడా చాలా హైలెట్ గా నిలవడంతో పాటు ప్రేక్షకులను బాగా అలరించి, మెప్పించింది. ఇకపోతే ఈ సినిమాలో సమంత, రామ్ చరణ్ లిప్ లాక్ ల మధ్య జరిగిన ఒక రహస్యం ఇటీవల బయటకు వచ్చింది. అదేంటో మనం తెలుసుకుందాం..
ప్రముఖ దర్శకుడు సుకుమార్ రామ్ చరణ్ కు  స్క్రిప్ట్ వినిపించినప్పుడే ఈ స్క్రిప్ట్ లో లిప్ లాక్ సీన్ ఉంది. అప్పుడు రామ్ చరణ్ -  సుకుమార్ కి మధ్య ఒక పెద్ద చర్చ జరిగింది.. అప్పటికి రామ్ చరణ్ కు ఉపాసనతో పెళ్లి కావడం, ఇక తను తీయబోయే సినిమాలో లిప్ లాక్ అంటే ఉపాసనకు నచ్చదని కరాఖండిగా చెప్పేశారు రామ్ చరణ్.. అప్పుడు సరే అని చెప్పిన సుకుమార్.. కచ్చితంగా ఆ సీన్ లేకపోతే సినిమా హైలెట్ కాదని.. షూటింగ్ సమయంలో ఎలాగైనా సరే రామ్ చరణ్ ను ఒప్పిద్దాం అని అనుకున్నాడు సుకుమార్..

ఇక ఈ సీన్ గురించి ఎవరు ఎప్పుడు ఏం చెప్పినా నిర్మొహమాటంగా ఆ సీన్ వద్దు అని చెప్పేవాడట. అయితే ఆ సీన్ జరిగే రోజు రానే వచ్చింది. రామ్ చరణ్ కి లిప్ లాక్ పెట్టు అని సుకుమార్ సమంతకి చెప్పాడు .. అప్పుడు కేవలం రామ్ చరణ్ పెదాలు మాత్రమే దగ్గరకు వస్తాయి.. దాన్ని మనం గ్రాఫిక్స్ లో మార్చి చేయొచ్చు అని చెప్పి , షూట్ కి రెడీ చేశాడు సుకుమార్.. యాక్షన్ చెప్పగానే సమంత మాత్రం నేరుగా లిప్ లాక్ ఇచ్చేసిందట.. ఆ తర్వాత రామ్ చరణ్ సుకుమార్ పై అలగడం, సుకుమార్ ఆ సీన్ కు ఎంత ప్రాధాన్యం ఉందో చెప్పడం సినిమా సూపర్ హిట్ అవ్వడం అన్ని అలా జరిగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: