సైరా బాను హెల్త్ అప్డేట్.. ఆ రూమర్లకు చెక్ పెట్టిన డాక్టర్

Vimalatha
గత కొంత కాలంగా బాలీవుడ్ సీనియర్ నటి సైరా బాను ఆరోగ్యం చాలా విషమంగా ఉంది. ఇటీవల ఆరోగ్యం బాలేకపోవడంతో సైరాని ఆసుపత్రిలో చేర్చారు. సైరా వెంట్రిక్యులర్ ఫెయిల్యూర్‌ (గుండె జబ్బు) అయ్యిందని, ఆమె యాంజియోగ్రఫీ చేయించుకోవాల్సి ఉంటుందని వైద్యులు గుర్తించారు. ఆ తరువాత సైరా డిప్రెషన్‌తో పోరాడుతున్నట్లు, ఆమె యాంజియోగ్రఫీ చేయించుకోవడానికి నిరాకరిస్తోందని వార్తలు వచ్చాయి.
తాజాగా ఓ జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వార్త తప్పు అని తేల్చింది. సైరాకు చికిత్స చేస్తున్న డాక్టర్ నితిన్ గోఖలే మాట్లాడుతూ "సైరా జీ డిప్రెషన్‌తో బాధపడలేదు. యాంజియోగ్రఫీ చేయించుకోవడానికి నిరాకరించలేదు' అని అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ 'నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా యాంజియోగ్రఫీ కొన్ని రోజుల తర్వాత చేస్తాము. ఎందుకంటే ముందుగా ఆమె మధుమేహాన్ని నియంత్రించాలి. కాబట్టి ఆమె ఈ చికిత్సకు నో చెప్పింది అనే దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు" అంటూ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు. సైరాని ఇప్పుడు ఐసీయూ నుండి తరలించినట్లు డాక్టర్ వెల్లడించాడు. అంతే కాకుండా ఆమె మునుపటి కంటే ఇప్పుడు బాగుందని, ప్రస్తుతానికి సైరాను డిశ్చార్జ్ చేయవచ్చని, ఆపై యాంజియోగ్రఫీ కోసం ఆమెను మళ్లీ ఆసుపత్రిలో చేర్చాల్సి ఉంటుందని డాక్టర్ చెప్పారు.
కొంతకాలం క్రితం ఆమె భర్త, లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ కన్నుమూయడం సైరాను కృంగదీసిందని, ఆమె 55 ఏళ్లుగా దిలీప్ కుమార్‌తో ఉన్నారు కాబట్టి బహుశా ఒత్తిడికి లోనవుతోందని ఆమె సన్నిహితులు చెప్పారు.
దిలీప్ కుమార్ జూలై 7 న మరణించారు. దిలీప్ కుమార్ జీవించి ఉన్నంత వరకు సైరా బాను అతడిని కంటికి రెప్పలా చూసుకునేది. సైరా ఒక ఇంటర్వ్యూలో దిలీప్ కుమార్ తన హృదయ స్పందన అని చెప్పారు. ఇప్పుడు దిలీప్ కుమార్ ఆమెను వదిలేసి వెళ్లడంతో సైరా పూర్తిగా ఒంటరి అయిపొయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: