రామ్ చరణ్ "ఎవడు" మూవీ గురించి తెలియని విషయాలు?

VAMSI
రామ్ చరణ్ ఇప్పటి వరకు తీసిన సినిమాలలో "ఎవడు" సినిమా సమయంలో చిత్రబృందమంతా చాలా టెన్సన్స్ పడ్డారు. ఎవడు మూవీ రిలీజ్ కు ముందే కథ అంతా లీక్ అవడం వంటి వివిధ కారణాలతో అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయడంలో చాలా ఆలస్యం చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ సైతం ఈ సినిమా రిలీజ్ కి ముందు చాలా నిరుత్సాహంతో ఉన్నారు. ఈ సినిమా గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమాలో రాంచరణ్, అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్, అమీ జాక్సన్, శృతి హాసన్ నటించారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించగా, వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేశారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు వినసోంపైన బాణీలను అందించారు.

* ఎవడు సినిమాను ఇంగ్లీష్ మూవీ "పేస్ ఆఫ్" ను ఆధారంగా తీసుకుని చిత్రీకరించారు.
* దిల్ రాజ్ కెరీర్ లో ఇప్పటి వరకు తీసిన సినిమాలలో "ఎవడు" సినిమా ఎక్కువకాలం షూటింగ్ జరుపుకుంది.
* 2014 సంక్రాంతి పండుగ సందర్భంగా "ఎవడు" మరియు మహేష్ బాబు "నేనొక్కడినే" చిత్రాలు రిలీజ్ అయ్యాయి. మహేష్ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద తుస్సుమనగా "ఎవడు" సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
* ఈ సినిమాను మలయాళంలో భయ్యా మై బ్రదర్ అనే పేరుతో దుబ్ చేసి విడుదల చేశారు.  
* మొదటగా ఈ సినిమాకు అనుకున్న పేరు "వాడే అన్న". ఆ తరువాత "ఎవడు" అని మార్చారు.
* అంతే కాకుండా మొదటగా అల్లు అర్జున్ సమంతలు ఈ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలొచ్చాయి. మళ్ళీ కొన్ని కారణాలతో సమంత ఈ మూవీ నుండి తప్పుకుంది. ఆ తరువాత కాజల్ ను అనుకున్నారు, కానీ ఆమె కూడా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో ఫైనల్ గా శ్రుతీ హాసన్ ను మరియు అమీ జాక్సన్ లను మెయిన్ లీడ్ గా సెలెక్ట్ చేసారు.
* ఇందులో కేవలం అతిధి పాత్రలో నటించిన కాజల్ అగర్వాల్ ఎటువంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించిందట.
* ఈ సినిమాలో ఒక పాటకు సంబంధించి శృతి హాసన్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, అది పెద్ద వివాదంగా మారింది. దీనిపైనా శృతి హాసన్ దిల్ రాజ్ పై కేసు పెట్టేందుకు కూడా సిద్ధమయ్యారు. దిల్ రాజు ఆ తర్వాత ఈ ఫోటోలు ఎలా బయటకు వచ్చాయో నాకు తెలియదు అని చెప్పడంతో పోలీసులు ఆ సినిమాకు పనిచేసిన కెమెరా మాన్ ఎడిటర్ అందరినీ విచారించి కేసు ఫైల్ చేశారు.
* అమీ జాక్సెన్  ఫోటోలపైన కూడా ఎమ్మిగనూరు లో కేసు పెట్టారు.
ఇలా అనేక వివాదాలు సస్పెన్స్ ల మధ్య విడుదలయి కూడా భారీ విజయాన్ని అందుకుంది. 2014 సంక్రాంతి విజేతగా నిలిచింది.
 
   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: