మహేష్ తో శృతి ... జంక్షన్ జాం చేసిన సాంగ్ ... ??

GVK Writings
సూపర్ స్టార్ మహేష్ బాబు తో శ్రీను వైట్ల తీసిన బ్లాక్ బస్టర్ మూవీ దూకుడు. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి ఎస్ థమన్ సంగీతం అందించగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర ఈ సినిమాని ఎంతో భారీగా నిర్మించారు. అయితే ఈ సినిమా తరువాత మరొక్కసారి మహేష్, శ్రీను వైట్ల జోడీగా కలిసి చేసిన మాస్, కమర్షియల్ యాక్షన్ మూవీ ఆగడు. ఈ మూవీ కూడా 14 రీల్స్ బ్యానర్ పైనే రూపొందింది.
మహేష్ సరసన హీరోయిన్ గా తమన్నా భాటియా నటించిన ఈ మూవీ మాత్రం విడుదల తరువాత ఆశించిన స్థాయి విజయాన్ని అయితే అందుకోలేకపోయింది. ఎన్కౌంటర్ శంకర్ అనే పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో సూపర్ స్టార్ మహేష్ ఈ సినిమాలో తన యాక్టింగ్ తో ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని కూడా ఎంతో ఆకట్టుకున్నారు. ఇక స్క్రీన్ పై మహేష్, తమన్నా జోడి ఎంతో ఆకట్టుకుంది. అయితే సినిమా ఫెయిల్ అయినప్పటికీ ఇందులోని సాంగ్స్ శ్రోతలను ఎంతో అలరించాయి.
మరీ ముఖ్యంగా ఈ సినిమాలో అందాల నటి శృతి హాసన్ ఒక స్పెషల్ మాస్ సాంగ్ చేయడం విశేషం. సూపర్ స్టార్ తో కలిసి జంక్షన్ లో అనే పల్లవితో సాగే ఈ సాంగ్ లో శృతి హాసన్ తన అందం, అద్భుతమైన డ్యాన్స్ లతో అందరినీ ఎంతో ఆకట్టుకుంది. థమన్ అందించిన మాస్ బీట్ కి భాస్కరభట్ల మరింత అందమైన సాహిత్యాన్ని అందించారు. థమన్, శృతి హాసన్, సింహా కలిసి ఎంతో ఆకట్టుకునేలా ఆలపించిన ఈ సాంగ్ అప్పట్లో థియేటర్స్ ని షేక్ చేసింది. ఇక మహేష్ కెరీర్ లో ది బెస్ట్ స్పెషల్ మాస్ సాంగ్స్ లో ఈ జంక్షన్ లో సాంగ్ ఒక ప్రత్యేక సాంగ్ గా నిలుస్తుంది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: