లేటేంటి స్వీటీ ... వెయిటింగ్ ఇక్కడ ... ??

GVK Writings
స్వీటీ అనుష్క శెట్టి టాలీవుడ్ కి సూపర్ మూవీతో నటిగా అడుగుపెట్టారు. నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్ తీసిన ఈ సినిమాలో అయేషా టాకియా మెయిన్ హీరోయిన్ గా యాక్ట్ చేయగా షాషా అనే క్యారెక్టర్ లో అనుష్క నటించారు. అప్పట్లో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాలో సోను సూద్ ఒక ముఖ్య పాత్ర చేసారు. అయితే ఆ తరువాత రవితేజ తో రాజమౌళి తీసిన విక్రమార్కుడు భారీ సక్సెస్ అనుష్క కి బాగా పేరు తెచ్చిపెట్టింది. అనంతరం గోపీచంద్ తో లక్ష్యం సినిమా తో కూడా హిట్ కొట్టిన అనుష్కకు ఆపైన మల్లెమాల ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై కోడిరామకృష్ణ తీసిన అరుంధతి సినిమా పెద్ద హిట్ సాధించి నటిగా ఆమెకు తిరుగులేని స్టార్డం,పేరు తెచ్చిపెట్టింది.
అక్కడి నుండి మరింతగా అటు తమిళ్ లో కూడా ఛాన్స్ లతో కొనసాగిన అనుష్క అక్కడ కూడా మంచి సక్సెస్ లు కొట్టారు. అలానే తెలుగులో కూడా పలువురు స్టార్ హీరోల సరసన ఆమెకు అవకాశాలు రావడం అందులో కొన్ని భారీ విజయాలు సొంతం చేసుకోవడం జరిగింది. అయితే నాలుగేళ్ళ క్రితం రాజమౌళి, ప్రభాస్ తో తీసిన బాహుబలి సినిమాల్లో అనుష్క, దేవసేన పాత్రలో నటించి అందరినీ తన నటనతో ఆకట్టుకున్నారు. ఆ సినిమాలు ఎంతటి గొప్ప విజయాలు సొంతం చేసుకున్నాయో అందరికీ తెలిసిందే. అనంతరం భాగమతి, నిశ్శబ్దం వంటి సినిమాలు చేసిన అనుష్క, మెగాస్టార్ నటించిన సైరా నరసింహారెడ్డి మూవీలో ఝాన్సీ లక్ష్మి భాయి గా కొన్ని క్షణాలు కనిపించారు. అయితే తదుపరి సినిమా ఇప్పటివరకు మొదలు కాకపోవడంతో ఫ్యాన్స్ ఎప్పటినుండో ఆమె లేటెస్ట్ మూవీ అనౌన్స్ మెంట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.
కాగా త్వరలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ఒక సినిమాలో అనుష్క నటించనున్నారు అంటూ కొద్దిరోజులుగా ఒక వార్త ప్రచారం అవుతున్నప్పటికీ దానిపై ఇంకా అఫీషియల్ గా ఎటువంటి ప్రకటన రాలేదు. లేటేంటి స్వీటీ, మీ మూవీ కోసం ఎప్పటినుండో వెయిటింగ్ ఇక్కడ అంటూ పలువురు అనుష్క ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంతకీ స్వీటీ అనుష్క తన ఫ్యాన్స్ కి గుడ్ ఎప్పుడు చెప్తారో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: