తీన్మార్ షురూ..అవినాష్ జంట‌పై శ్రీముఖి..!

MADDIBOINA AJAY KUMAR
జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోతో ఎంతోమంది పాపుల‌రాటీ సంపాదించుకున్నారు. అలా పాపుల‌ర్ అయిన వారు టీవీషోలు సినిమాలు..ఇత‌ర కార్య‌క్ర‌మాల‌తో ఫుల్ బిజీగా ఉండి చేతినిండా సంపాదించుకుంటున్నారు. అలా జ‌బ‌ర్ద‌స్త్ తో పాపులారిటీ సంపాదించుకుని ఫుల్ బిజీగా మారిన వారిలో ముక్కు అవినాష్ కూడా ఒక‌రు. అవినాష్ అవినోస్ గా ఎంతో ఫేమ‌స్ అయ్యారు. స్కిట్ ల‌లో అవినాష్ త‌న ముక్కు పైనే జోకులు వేయించుకుని న‌వ్వించేవాడు. అలా ఎన్నో స్కిట్ లు చేసి జ‌బ‌ర్దస్త్ లో రోజా మ‌రియు నాగ‌బాబుల‌కు అవినాష్ ల‌కు ఫేవ‌రెట్ క‌మిడియ‌న్ గా మారిపోయారు. అంతే కాకుండా అవినాష్ ఆ త‌ర‌వాత బిగ్ బాస్ 4లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక బిగ్ బాస్ లో మొద‌ట క‌మిడియ‌న్ కుమార్ సాయి ఎంట్రీ ఇవ్వ‌గా ఆయ‌న పెద్ద‌గా ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించ‌లేక‌పోయారు. 

కానీ అవినాష్ మాత్రం ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించ‌డంలో స‌క్సెస్ అయ్యారు. అలా బిగ్ బాస్ లో అవినాష్ కామెడిని ఎంతో మంది ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా అమ్మా రాజ‌శేఖ‌ర్...మెహ‌బూబ్ తో అవినాష్ చేసిన కామెడీ బిగ్ బాస్ ఎపిసోడ్ లోనే హైలెట్ గా నిలిచింది. ఆ త‌ర‌వాత నాగార్జున కూడా అనినాష్ కామెడీకి ఫిదా అయ్యారు. అవినాష్ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంద‌ని ఇంటి స‌భ్యులు ప‌లుమార్లు ప్ర‌శంస‌లు కురింపించారు. ఇక హోస్ట్ చేసిన‌ నాగార్జున అయితే అవినాష్ పెళ్లిపై ఎన్నో జోకులు వేసేవారు.

త‌న‌కు బ‌య‌ట సంబంధాలు చూస్తున్నార‌ని అవినాష్ చెప్ప‌డంతో నాగార్జున కూడా అవినాష్ పెళ్లిప్ర‌స్తావ‌న తీసుకువ‌చ్చి న‌వ్వుకునేవారు.ఇదిలా ఉంటే ఎట్ట‌కేల‌కు ముక్కు అవినాష్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాను పెళ్లి చేసుకుంటున్న‌ట్టు అవినాష్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. దాంతో అవినాష్ మిత్రులు సెల‌బ్రెటీలు ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే అవినాష్ కు ఇండ‌స్ట్రీలో క్లోజ్ ఫ్రెండ్ అయిన శ్రీముఖి కూడా పెళ్లి రోజు శుభాంక్ష‌లు తెలియ‌జేసింది. అవినాష్ ఎంగేజ్ మెంట్ ఫోటోల‌కు శ్రీముఖి...కంగ్రాట్యేలేష‌న్స్ ఇక తీన్ మార్ షురూ అంటూ కామెంట్లు పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: