ఇది సర్కస్ కాదండోయ్.. ఫ్యామిలీ సర్కస్ ..!!

Divya
ముఖ్యంగా ఎక్కడైనా సరే సర్కస్ అనగానే వినోదంతో కూడిన సంతోషం ఉంటుంది. ఇక అదే సినిమాలో సర్కస్ అయితే .. సినిమా చూసినంత సేపు వినోదంతో పాటు కడుపు కూడా చెక్కలు అవుతుంది అని చెప్పవచ్చు.. అలాంటి సినిమాలు కేవలం ప్రేక్షకులను మాత్రమే కాదు ఫ్యామిలీ లను కూడా బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి.. ముఖ్యంగా ఫ్యామిలీలను ఇటీవల ఎంటర్టైన్మెంట్ చేయడం కోసమే, దర్శకులు ప్రత్యేకమైన కథలను వ్రాస్తున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. ఇటీవల కాలం తో పోల్చుకుంటే 1990 నుంచి 2010 ఈ మధ్యకాలంలో ఇప్పుడున్న స్టార్ హీరోలంతా అప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీలతో వచ్చి ప్రేక్షకులకు కనువిందు చేశారు..
ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ విలన్ గా గుర్తింపు పొందిన జగపతి బాబు. 2001వ సంవత్సరంలో తెలుగు భాష కామెడీ చిత్రంగా తెరకెక్కిన చిత్రం ఫ్యామిలీ సర్కస్. ఈ చిత్రం ఎలా ఉంది అంటే నాటికీ నేటికీ సరికొత్త కొత్తదనాన్ని నింపుతుందని చెప్పాలి. ఎప్పుడు చూసినా సరే ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టకుండా సినిమా మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ను పెంచుతుంది. ఇక ఈ సినిమాను తేజ దర్శకత్వం వహించగా, మెలోడీ మల్టీ మీడియా బ్యానర్ పై సుంకర మధు మురళి నిర్మించడం జరిగింది.
ఇక ఈ సినిమాలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, రోజా తదితర నటీనటులు నటించి ఈ సినిమాకు హైలెట్ గా నిలిచారు. ఎప్పుడూ సీరియస్ గా ఉండే నటీనటులు ఈ సినిమాలో కామెడీ చేయడంతో ప్రతి ఒక్కరిని బాగా ఆకట్టుకుంది. కలెక్షన్ల పరంగా కొంచెం డౌన్ అయినప్పటికీ, ఎంటర్టైన్మెంట్ చేయడంలో ఏమాత్రం తీసిపోలేదు. ఒక గంట 27 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ప్రతి నిమిషం కూడా బాగా ఆనందాన్ని పంచింది. ముఖ్యంగా ఇందులో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుధాకర్ ,సునీల్ ,తనికెళ్ల భరణి వంటి స్టార్ హాస్య నటులు తమ కామెడీ తో  ఈ సినిమాకు హైలెట్ గా నిలిచారు. మొత్తానికి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈ సినిమా బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: