విశాల్ సామాన్యుడు కాదు..!

Pulgam Srinivas
కోలీవుడ్ హీరో విశాల్ 'ప్రేమ చదరంగం' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఆ తర్వాత 'పందెంకోడి' సినిమాతో విశాల్ తెలుగు లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు .ఈ  సినిమా ఇచ్చిన జోష్ లోనే ఈ హీరో తమిళంలో ఏ సినిమాలో నటించిన ఆ సినిమాను దాదాపుగా తెలుగులో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అందులో భాగంగానే పొగరు, అభిమన్యుడు, చక్ర, యాక్షన్, పూజ, పందెంకోడి 2, డిటెక్టివ్, జయసూర్య, అయోగ్య, ఒక్కడొచ్చాడు, ఇలాంటి మరెన్నో సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇలా ఇప్పటివరకు 30 సినిమాలు పూర్తి చేసిన విశాల్ ప్రస్తుతం 31వ సినిమాతో బిజీగా ఉన్నాడు.

అయితే తాజాగా నేడు ఆగస్టు 29 వ తేదీ న విశాల్ పుట్టిన రోజు సందర్భంగా 31 వ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. విశాల్ లేటెస్ట్ తెలుగు మూవీ టైటిల్ 'సామాన్యుడు' అని తెలియజేస్తూ ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ను సినిమా బృందం విడుదల చేసింది. 'నాట్ ఎ కామన్ మ్యాన్' అనేది ఈ సినిమాకు ట్యాగ్ లైన్. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాకు నూతన దర్శకుడు  తు పా శరవణన్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా విడుదలైన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో విశాల్ విలన్లను ఒక ఆట ఆడుకుంటున్నాడు. ఇలా పవర్ఫుల్ లుక్ లో విశాల్ కనిపించడంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటీ డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తోంది. కోలీవుడ్ నటులు బాబురాజ్ జాకబ్, యోగి బాబు , పిఎ తులసి, రవీనా రవి ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నాడు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం అనౌన్స్ చేయనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: