నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో.. ఇంద్రజ డాన్స్ ఇరగదీసిందిగా?

praveen
ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా, పిల్లి కల్ల సుందరిగా అటు తెలుగు ప్రేక్షకులందరికీ ఆకట్టుకుంది ఇంద్రజ.  ఎన్నో ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది.  ఇక ఇంద్రజ నటించిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటి యమలీల.  అప్పటికే ఇంద్రజ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది.  అలాంటి హీరోయిన్ ఏకంగా కమెడియన్ గా ఉన్నా అలీ హీరోగా తెరకెక్కిన యమలీల సినిమాలో నటించింది.  1994లో ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  అయితే ఇంద్రజా హీరోయిన్ ఆలీ పక్కన నటించినందుకు అప్పట్లో విమర్శలు కూడా ఎదుర్కొంది.

 కానీ ఆలీ ఇంద్రజ కాంబినేషన్లో వచ్చిన యమలీల సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. అనుకున్న దానికంటే పెద్ద హిట్ సాధించి  విమర్శకుల నోళ్ళు మూయించింది.  ఈ సినిమాతో పాటు ఇంద్రజ కి మరింత క్రేజ్ వచ్చింది.  ముఖ్యంగా ఈ సినిమాలో బాగా పాపులర్ అయిన సాంగ్ నీ జీను ప్యాంటు చూసి బుల్లమ్మ అనే సాంగ్. ఇక ఈ పాట ఇప్పటికీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ఎవర్గ్రీన్ పాటలలో  ఇది కూడా ఒకటి అని చెప్పాలి.  అప్పట్లో ఇంద్రజ ఈ పాట పై అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్తో చేసి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

 ఇక ఇప్పుడు మరో సారి ఇదే పాట పై అద్భుతమైన  డాన్స్ చేసి మరోసారి తెలుగు ప్రేక్షకులందరికీ పాత రోజులను గుర్తుచేసింది ఇంద్రజ. ఇటీవలి కాలంలో శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమంలో జడ్జిగా ఎంట్రీ ఇచ్చింది ఇంద్రజ.  ఇకపోతే ప్రస్తుతం ఈ టీవీ లో వినాయక చవితి సందర్భంగా ఊరిలో వినాయకుడు అనే ఈవెంట్ ప్లాన్ చేశారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించి ఇటీవలే రెండో ప్రోమో విడుదల చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేశారు.  ఇక ఈ ప్రోమో లో భాగంగా ఇంద్రజ ఈ వయసులో కూడా మరోసారి జీన్స్ ప్యాంట్ టి షర్ట్ వేసి..  యమలీల సినిమాలో నుంచి నీ జీను ప్యాంటు చూసి బుల్లమ్మ అనే పాట పై డాన్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. డాన్స్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అక్కడే ఉన్న రోజా ఫిదా అయిపోయింది. ఎంతో అద్భుతంగా చేశారు అంటూ ఇంద్రజ డాన్స్ కి కితాబిచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: