రోజా ఆ స్టార్ హీరోతో సినిమా చేస్తానంటోంది...!

murali krishna
అలనాటి స్టార్ హీరోయిన్ అయిన రోజా ప్రతి ఒక్కరికి బాగా తెలిసిన హీరోయిన్. ఈమె తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.అంతేకాకుండా రోజా ప్రస్తుతం బుల్లితెరపై కూడా బాగా హల్ చల్ చేస్తుంది. మధ్య గోపిచంద్ హీరోగా నటించిన గోలిమార్ సినిమాలో హీరోయిన్ ప్రియమణి తల్లిగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.అయితే ఛాన్స్ వస్తే ఖచ్చితంగా ఆ స్టార్ హీరోతో నటిస్తానని చెప్పుకొచ్చింది రోజా. అయితే స్టార్ హీరో ఎవరో చూద్దాం.
ప్రస్తుతం రోజా పొలిటికల్ గా బిజీగా ఉండటం  వలన సినిమాల మీద ఎక్కువ ఆసక్తి చూపించలేకపోతుందట. కానీ తనకు అవకాశం వస్తే ఖచ్చితంగా చిరంజీవి మరియు బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో నటించడానికి తాను సిద్ధం అని చెప్పుకొచ్చిందట. అంతేకాకుండా అప్పట్లో చిరంజీవి గారు తనని సినిమా షూటింగ్ ల సమయాలలో బాగా ప్రోత్సహించే వారిని తెలిపిందట.
 మెగాస్టార్ చిరంజీవి 66 వ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేసిందని సమాచారం. అంతేకాకుండా చిరంజీవితో అప్పట్లో పనిచేసిన ముఠామేస్త్రి సినిమా కి మరియు ముగ్గురు మొనగాళ్లు సినిమా తో బాగా మంచి స్నేహితులు అయ్యాము అని తెలిపిందట. ఇక అంతే కాకుండా రాజకీయం పరంగా అది రాజకీయమే అలాగే సినిమా పరంగా సినిమానే అని చెప్తూ వచ్చిందని సమాచారం.
ఇక రోజా ప్రస్తుతం నగరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే గా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈమె ప్రస్తుతం బుల్లితెర పాపులర్ షో అయిన జబర్దస్త్ షో కు జడ్జిగా వ్యవహరిస్తూ ఉన్నది.అయితే ఏది ఏమైనా రోజా సెల్వమ్ ఈ స్టార్ హీరోలతోనే నటించాలని ఉంది అని తన మనసులోని మాటను తెలిపింది. అయితే భవిష్యత్ లో ఈ మెకు అవకాశం ఇస్తారేమో మనం ఎదురుచూడాల్సి వుంది. ఇక అంతే కాకుండా ఈమె చేసిన కామెంట్లు కూడా తెగ వైరల్ గా మారుతున్నాయని సమాచారం. ఇక రోజా  అభిమానులు తమ రోజా ఎంతో మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తి అని అందరు కామెంట్స్ చేస్తున్నట్లు సమాచారం అందింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: