స్వాతంత్య్ర‌మా పాడుకో : విన‌రా వినరా దేశం మ‌న‌దేరా..

Paloji Vinay
మ‌న ఆలోచ‌న‌ల‌ను మార్చే శ‌క్తి సంగీతానికి, పాట‌ల‌కు ఉంటుంది. ఏ ఉద్య‌మం అయినా ఏ వేడుక అయినా సంగీతం ప్ర‌ధానం. దేశ‌భ‌క్తి పెంపొందించ‌డంలో పాట పాత్ర ముఖ్య‌మైన‌ది. దేవ‌భ‌క్తి పాట‌లు విన్న‌ప్పుడు మ‌న‌కు ఏదో తెలియ‌ని ఒక భావం క‌లుగుతుంది. కొన్ని పాటలు వింటే రోమాలు నిక్క‌పొడుచుకుంటాయి. స‌మ‌రంలో దూకేందుకు కాలు దువ్వుమంటాయి కొన్ని పాట‌లు. దేశం ప‌ట్ట ప్రేమ‌ను రేకెత్తించే అనేక పాట‌ల‌ను మ‌నం సినిమాల ద్వారా వింటున్నాం. అదే కోవ‌లోకి రోజా సినిమాలో వ‌చ్చిన `విన‌రా విన‌రా దేశం మ‌న‌దేరా` పాట‌.

  1992 లో విడుద‌ల‌యిన రోజా సినిమాలోని ది ఈ పాట‌. నాగుర్ బాబు పాడిన ఈ పాట‌కు ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఏ ఆర్ ర‌హ్మాన్ సంగీతం అందించాడు. అప్ప‌ట్లో బ్లాక్ బాస్ట‌ర్ హిట్ గా నిలిచిన దేశ‌భ‌క్తి చిత్రం రోజా. ఇప్ప‌టికీ ఆ సినిమా ప్ర‌భావం భార‌త దేశ‌భ‌క్తి సినిమాల‌తో పాటు పౌరుల‌పై కూడా ఉంది.  75వ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఆ పాట గురించి..

  ` విన‌రా విన‌రా దేశం మ‌న‌దేరా  
    అన‌రా అన‌రా రేపిక మ‌న‌దేరా` అంటూ దేశం మ‌న‌దే అంటూ రేప‌టి గురించి ఆలోచింప‌జేస్తుంది.
 ` నీ ఇల్లు ఆంధ్ర‌దేశం అయినా
  నీ నామం ఇండియ‌నంటూ నిత్యం చాట‌రా` అంటూ నీది ఏ రాష్ట్రం, ఏ భాష అయినా మ‌నం భార‌తీయుల‌మేన‌ని గుర్తు చేస్తుంది.
 `త‌రం మారిన గుణ‌మొక్క‌టే
   స్వ‌రం మారిన నీతోక్క‌టే
   మ‌తం మారిన ప‌లుకొక్క‌టే
   విల్లు మారిన గురి ఒక్క‌టే
  దిశ మారిన వెలుగొక్క‌టే
   ల‌య మారిన శ్రుతి ఒక్క‌టే
   అరె ఇండియా అంటే ఒక్క‌టే లేరా..` అంటూ భార‌తీయులంతా ఒక్క‌టేన‌ని నిన‌దించింది.
  `ఏలా ఏలా నీలో దిగులంటా
  వేకువ వెలుగు ఉందీ ముందంటా
  ర‌క్తంలో భార‌త‌త్వం ఉంటే చాలురా
  ఒక‌టైనా భార‌త‌దేశం కాచేను నిన్నురా` అంటూ దిగులెందుకు భ‌విష్య‌త్తు ఉంది చాలా.. నీ ర‌క్తం దేశప్రేమ ఉంటే చాలు భార‌త‌దేశమే నిన్ను ర‌క్షిస్తుంద‌ని ధైర్యాన్నిస్తుంది.
 `న‌వ‌భార‌తం మ‌న‌దేనురా
   ఇది స‌మ‌త‌తో రుజువాయెరా
  మ‌న ప్రార్థ‌మే విలువాయెరా
  నీ జాతికై వెలిగిందిరా
  నిశిరాల‌నే మ‌రిపించెరా
  ఈ మ‌ట్టియే మ‌న క‌లిమిరా లేరా..` అంటూ న‌వ భార‌త మ‌న‌దేన‌ని ఇది స్నేహంతో రుజువ‌వున‌ని ఇదే భ‌ర‌త జాతికి వెలుగయింద‌ని దేశ మ‌ట్టే మ‌న స‌ర్వ‌స్వం అని చాటింది ఈ పాట‌.
   ఇలా ఈ సినిమాలోని అన్ని పాట‌లు శ్రోత‌ల‌ను అమితంగా ఆక‌ట్టుకున్నాయి.
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: