అనుష్క పేరు వెనుక అంత కథ ఉందా?

murali krishna
తెలుగు మరియు తమిళ భాషల్లో ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న అనుష్క మంగుళూరుకి చెందిన ఈ బ్యూటీ హీరోయిన్ కాక ముందు యోగా టీచర్ అన్న విషయం అందరికి తెలిసిందే. అయితే నాగార్జున ఈమెను 'సూపర్'
సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం చేశారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోయిన అనుష్కకి టాలీవుడ్లో మంచి అవకాశాలే వచ్చాయని సమాచారం ఈరోజున ఆమె ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి కారణం నాగార్జున పాత్ర ఎంతో ఉందని అనుష్క చాలా సందర్భాల్లో అనుష్క చెప్పినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా నిజానికి అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి మాత్రమేనని సమాచారం.కాకపోతే ఈమెకు అనుష్క పేరుని పెట్టింది మాత్రం ఓసూపర్ స్టార్ నటుడట. ఆయన మరెవరో కాదు లాక్ డౌన్ లో అందరికి సాయం చేసిన రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్.సూపర్' సినిమాలో అనుష్కకి అన్నయ్య పాత్రని సోనూ సూద్ పోషించాడు అని అందరికి తెలిసిందే . ఆ సినిమా కథ మొత్తం అనుష్క పాత్ర చుట్టూనే తిరుగుతుందట. ఆ చిత్రం షూటింగ్ సమయంలో అనుష్క- సోనూ సూద్ ల మధ్య మంచి స్నేహం ఏర్పడినట్లు సమాచారం. అదే టైములో స్వీటీగా ఉన్న ఆమె పేరుని అనుష్కగా మార్చుకోమని సోను సూద్ సలహా ఇచ్చినట్లు సమాచారం.
అనుష్క అనే పేరునే స్క్రీన్ పై వేసేస్తాను అని పూరి కూడా అనడంతో అనుష్క సరే అనక తప్పలేదట. అప్పటి నుండి స్వీటీ శెట్టి అనుష్క శెట్టి గా మారిపోయింది.సోనూసూద్ అనుష్క శెట్టి లు 'అరుంధతి' సినిమాలో కూడా కలిసి నటించారు. నిజానికి 'అరుంధతి' చిత్రానికి హీరోయిన్ గా మొదట లక్ష్మీ మంచు ని అనుకున్నారట దర్శకుడు కోడి రామకృష్ణ. కానీ ఆమె ఆ పాత్రని రిజెక్ట్ చేసిందట. ఆ టైములో అనుష్కని 'అరుంధతి' పాత్రకి ఎంపిక చేసుకోమని అది నీకు మంచి పేరు తెచ్చి పెడుతుందని సోనూ సూదే దర్శకుడు కోడి రామకృష్ణని ఒప్పించినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: