ఏఎన్ఆర్ కథతో బాలకృష్ణ బ్లాక్ బస్టర్..!

Pulgam Srinivas
దర్శకధీరుడు రాజమౌళి తండ్రి ప్రముఖ కథ రచయిత అయిన విజయేంద్ర ప్రసాద్ ఎన్నో హిట్ సినిమాలకు కథను అందించారు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల సినిమాలకు కూడా కథలను అందించారు. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'బజరంగీ బాయ్ జాన్' సినిమాతో పాన్ ఇండియా కథ రచయితగా ఎదిగాడు. విజయేంద్రప్రసాద్ ఈ మధ్య ఒక ప్రముఖ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు తెలియజేశారు. ఇందులో భాగంగా యాంకర్ మీకు సినిమా కథ కాన్సెప్ట్ ఏ విధంగా జనరేట్ అవుతుంది అని అడగగా..? నాకు కొన్ని సినిమాలు ఇన్స్పిరేషన్ గా ఉంటాయి. 

ఉదాహరణకు నేను బాలకృష్ణ హీరోగా నటించిన 'బొబ్బిలి సింహం' సినిమా కథ రాశాను. దానిలో కథ ప్రకారం బాలకృష్ణ ,రోజా ఇద్దరు ప్రేమించుకుంటారు. కానీ రోజా వాళ్ళ తండ్రికి బాలకృష్ణ తో పెళ్లి ఇష్టం లేకపోవడం వల్ల రోజా కు వేరే వివాహం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఆ సమయంలో బాలకృష్ణ ఆమెను తీసుకెళ్లి వివాహం చేసుకుంటాడు. ఆ వివాహం అయిన తర్వాత రోజాకు క్యాన్సర్ ఉందని తెలుస్తోంది. నేను చనిపోతాను అని తెలిసిన కూడా బావ మరో పెళ్లి చేసుకోడు అనే ఉద్దేశంతో మా నాన్నకు ఇష్టం లేని పెళ్లి ఎలా చేసుకుంటాను అనుకున్నావు. నువ్వు ఇలా జీవితాంతం బాధపడుతూనే ఉండాలి. నేను నీతో సంసారం చేయను. నీ వంశం నీతోనే ఆగిపోవాలి అని బాలకృష్ణను రెచ్చగొడుతూ ఉంటుంది.

దీనిని బాలకృష్ణ నానమ్మ అయిన శారద వినేలా చేస్తుంది. ఆ తర్వాత శారద, బాలకృష్ణకు ,మీనాతో రెండో వివాహం చేస్తుంది.ఈ ఎలిమెంట్ నాకు 'ప్రేమాభిషేకం' సినిమా నుండి ఇన్స్పిరేషన్. ఆ సినిమాలో కూడా నాగేశ్వరరావు కు క్యాన్సర్ ఉంటుంది. ఆ విషయం తెలిస్తే శ్రీదేవి ఎక్కడ బాధ పడుతుందో అని పనిగట్టుకొని వేరే అమ్మాయితో సంబంధం ఉన్నట్లు చేస్తాడు. శ్రీదేవి పెళ్లి చేసుకున్న తర్వాత తనకు ఈ విషయం తెలుస్తుంది అని, అది కథకు ఎలిమెంట్ అని వివరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: