స్వీటీ ఆ సినిమా కోసం అన్ని నెలలు వేచి వుందా..?

Divya
సైజ్ జీరో సినిమా ద్వారా స్వీటీ గా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క.. లేడి ఓరియెంటెడ్ చిత్రం అరుంధతి ద్వారా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి, సూపర్ స్టార్ హీరోయిన్ గా  గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అని చెప్పవచ్చు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో అనుష్క మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ మాత్రమే కాదు మోస్ట్ సీనియర్ హీరోయిన్ కూడా. ఇక ఈమె సింప్లిసిటీ కి కేరాఫ్ అడ్రస్. సున్నితమైన మనస్తత్వం, ఎవరికైనా  ఆపద అంటే చలించిపోయే గుణం కలిగిన నటీమణి.
అనుష్క మాతృభాష తుళు. అయినప్పటికీ తెలుగు చక్కగా మాట్లాడుతుంది. అనుష్కను సినీ ఇండస్ట్రీ లోకి రాకముందు స్వీటీ శెట్టి గా పిలిచేవారట. ఇక సైజ్ జీరో సినిమాలో కూడా ఆమె స్వీటీగా తన పేరును పెట్టుకోవడం గమనార్హం.. అయితే స్వీటీ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు యోగా టీచర్ గా  పని చేసేది. అయితే సాధారణంగా అనుష్క కంటే వాళ్ళ కజిన్ సిస్టర్స్  చాలా అందంగా ఉండేవారట. ఇక సినిమాల్లోకి  వాళ్లకు రాని అవకాశం, అనుష్కకు ఎలా వచ్చిందో తనకు  ఇప్పటికీ అర్థం కాలేదని పలుసార్లు చెబుతూ ఉంటుంది.
ముఖ్యంగా ఈమె నటించిన సినిమాలలో రుద్రమదేవి, వేదం, అరుంధతి ,బిల్లా, సూపర్ వంటి చిత్రాలు చాలా ఇష్టం అని చెప్పింది. అనుష్క పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే ఈ సినిమా కోసం అవకాశాలు రాక ముందు ఆమె మిత్రులు పూరి జగన్నాథ్  ను పరిచయం చేశారట. అయితే ఆమె అంతకు ముందు ఎప్పుడూ పూరి జగన్నాథ్ సినిమాలు చూడలేదు. అంతేకాదు ఆమెకు సినిమాలంటే కూడా పెద్దగా ఇష్టం లేకపోవడంతో పూరి జగన్నాథ్ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉండేదట.

సూపర్ సినిమా ఆడిషన్స్ కి అనుష్క హైదరాబాద్ వచ్చింది. అయితే ఆమె అక్కడ ఆడిషన్స్ చూసి అక్కడ నుండి  భయపడి వెళ్లిపోవాలి అనుకున్నదట. అయితే ఆమె మానసిక స్థితిని అర్థం చేసుకున్న పూరిజగన్నాథ్ అలాగే నాగార్జున దాదాపు 9 నెలల పాటు ఆమెను షూటింగ్ స్పాట్ లో, ఆమె పూర్తిగా అర్థం చేసుకునే లాగా వెయిట్ చేయించారట. అలా ఆమెకు పూర్తిగా సినిమాలపై ఒక  అవగాహన వచ్చిన తర్వాతనే 2005 మార్చి 12వ తేదీన మొదటిసారి అనుష్క కెమెరా ముందుకు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: