'లేడీ దేవదాస్' గా రానున్న స్వీటీ ?

VAMSI
గ్లామర్ పాత్రలతో పరుగులు తీయించినా, సంప్రదాయ దుస్తుల్లో తెలుగింటి ఆడపడుచులా సందడి చేసినా, కాళీకామాతలా ఆగ్రహించినా, అమాయకంగా అల్లరి చేసినా..ఇలా ఏ క్యారక్టర్ లో ఇట్టే ఒదిగిపోతుంది అనుష్క శెట్టి. సూపర్ చిత్రంతో టాలీవుడ్ లోకి దూసుకొచ్చిన ఈ యోగా మాస్టర్, ఇప్పటికి  మూవీ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదేళ్ల పైనే గడుస్తోంది. అయినా ఇప్పుడు కూడా అంతే క్రేజ్ తో అందరి మన్నలను పొందుతోంది జేజెమ్మ. వైవిధ్య భరితమైన పాత్రలను ఎంచుకుంటూ తనను తాను కొత్తగా చూడటానికి ఇష్టపడుతుంది మన స్వీటీ.  అయితే ఈమె ఇప్పుడు మరో డిఫరెంట్ రోల్ తో మన ముందుకు రాబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. లేడీ దేవదాస్ లా వెండి తెరపై కనిపించబోతున్నారు అంటూ గుస గుసలు వినపడుతున్నాయి. 

ఓ సాఫ్ట్ వేర్ ప్రేమలో మునిగి.. అతన్ని పూర్తిగా నమ్మిన హీరోయిన్ ని తర్వాత  అతడు మోసం చేసి వదిలి వెళ్ళిపోతాడు. అయితే అలా వెళ్లిన హీరోని హీరోయిన్ మర్చి పోలేక లేడీ దేవదాస్ లా మారిపోతుందా ? లేక అతడికి బుద్ది చెప్పి సరైన గుణపాఠం నేర్పుతుందా ? అదీ కాక అతడి తప్పు తాను తెలుసుకునేలా చేసి అతనితో జీవితం పంచుకుంటుందా ? ఇంకేదైనా అన్నది కథపై ఆధారపడి ఉందని, కానీ కాన్సెప్ట్ మాత్రం ఇదేనని తెలుస్తోంది. అయితే మొత్తానికి లేడీ దేవదాస్ పాత్రలో అనుష్క నటించబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 

కాక పోతే అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఈ విషయం కాస్త సస్పెన్సే. ఇదిలా వుంటే స్వీటీ ప్రస్తుతం టాలీవుడ్ లో జాతి రత్నాలు ఫేమ్  నవీన్‌ పొలిశెట్టితో ఓ లవ్  స్టొరీ మూవీ చేయబోతోందని గత కొన్ని నెలలుగా  ఓ రేంజ్ లో  ప్రచారం కొనసాగుతోంది. కానీ అధికారకంగా మాత్రం ఎటువంటి అప్‌ డేట్‌ ఇంకా రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: