ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమాలో సూపర్ కామెడీ ట్రాక్..!

shami
సలార్, ఆదిపురుష్ సినిమాలతో పాటుగా నాగ్ అశ్విన్ సినిమా రీసెంట్ గా ముహుర్త కార్యక్రమాలు జరుపుకుంది. ప్రాజెక్ట్ కె వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో సెపరేట్ కామెడీ ట్రాక్ ఉండబోతుందని తెలుస్తుంది. సినిమాలో ప్రభాస్ తో పాటుగా బ్రహ్మానందం కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలుస్తుంది. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న బ్రహ్మి ఈమధ్యనే జాతిరత్నాలు సినిమాలో మెప్పించారు.
ఆ తర్వాత బ్రహ్మానందం ఒప్పుకున్న సినిమా ఇదే అని చెప్పొచ్చు. ప్రాజెక్ట్ కె సినిమాలో హాలీవుడ్ రేంజ్ కథగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో గ్రాఫిక్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా ఈ సినిమా కథ, కథనాలు ఉంటాయని తెలుస్తుంది. వైజయంతి బ్యానర్ లో అశ్వని దత్ ఈ సినిమాను 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తారని తెలుస్తుంది.
సినిమాలో ప్రభాస్ ను సూపర్ హీరోగా కనిపిస్తాడని అంటున్నారు. బాహుబలి సినిమాతో నేషనల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమాతో హాలీవుడ్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకుంటాడని అంటున్నారు. ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమాలో బిగ్ బీ అమితాబ్, దీపికా పదుకొనె లాంటి స్టార్స్ నటిస్తున్నారని తెలిసిందే. సినిమాలో కామెడీ కూడా హైలెట్ గా నిలిచేలా ఉంటుందని చెబుతున్నారు. మొత్తానికి నాగ్ అశ్విన్ ప్రభాస్ తో భారీ ప్లానే వేసినట్టు ఉన్నాడని అనిపిస్తుంది. ప్రభాస్ ప్రాజెక్ట్ కె తప్పకుండా ఊహించని విధంగా భారీ రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు. తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచేలా ఈ మూవీ ఉండబోతుందని టాక్. ప్రభాస్ వరుస క్రేజీ సినిమాలతో ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమయ్యాడు. రాబోయే సినిమాలన్ని భారీ సినిమా అవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఈ సినిమాలన్ని ప్రభాస్ రేంజ్ మరింత పెంచే అవకాశం ఉందని టాక్

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: