సన్నీలియోన్ కు కోట్లలో బుకింగ్ !

Seetha Sailaja
దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులు వల్ల చాలామంది ఆదాయాలు తగ్గిపోయినా బడా పారిశ్రామిక వేత్తలు ఫిలిం సెలెబ్రెటీల ఆదాయం మటుకు ఈ కరోనా పరిస్థితులను కూడ లెక్కచేయకుండా విపరీతంగా పెరిగిపోతోంది. పోర్న్ స్టార్ గా ఒక ఇమేజ్ ని ఏర్పరుచుకుని ఆతరువాత సినిమాలలోకి వచ్చి పెద్దగా రాణించలేకపోయినా సన్నీలియోన్ ఆదాయం ఏమాత్రం తగ్గలేదు అన్న విషయానికి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.
 
ప్రముఖ సెలెబ్రెటీలు ఒక్క ట్విట్ చేయాలి అన్నా కోట్లల్లో పారితోషికం తీసుకుంటున్నారు. అనుష్క శర్మ నుండి సమంత వరకు ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి తమ నోరు విప్పాలి అంటే కోట్లు వసూలు చేస్తున్నారు. ఒక మాదిరి చిన్న సెలెబ్రెటీలు కూడ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేయాలి అంటే లక్షలలో పారితోషికం తీసుకుంటున్నారు. ఒక సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ లేదంటే ఒక టీజర్ విడుదల చేయడానికి కూడ భారీ పారితోషికాలు అడుగుతున్నారు.
 
 ఈమధ్య సన్నీలియోన్ ‘బాయ్స్’ అనే చిన్న సినిమా ముంబాయ్ లో లాంచ్ చేసింది. చిన్న సినిమా కాబట్టి ఎవరైనా పెద్ద సెలెబ్రెటీ చేయి తమ సినిమా పై పడితే కాని ఎవరు పట్టించుకోరు అన్న ఉద్దేశ్యంతో ఈమూవీ నిర్మాతలు సన్నీలియోన్ ను సంప్రదిస్తే ఆమె ఏమాత్రం మొహమాట పడకుండా 12 కోట్ల పారితోషికం అడిగినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆసినిమా బడ్జెట్ కూడ ఆ రేంజ్ లో లేదు. అయినప్పటికీ నిర్మాతలు ధైర్యం చేసి సన్నీలియోన్ అడిగిన పారితోషికం ఇచ్చి ఆమెతో తమ మూవీ టీజర్ లాంచ్ చేయించారు.
 
 సన్నీలియోన్ ఎఫెక్ట్ తో ఈ టీజర్ కు మిలియన్ వ్యూస్ పైగా వచ్చినట్లు తెలుస్తోంది. ఈమధ్య విడుదలకు రెడీగా ఉన్న ఒక చిన్న సినిమా ప్రమోషన్ కోసం ఒక ఛానల్ లో ఇంటర్వ్యూ నిర్వహిస్తూ ఆ మూవీలో నటించిన నటీనటులు అందర్నీ ఆ మూవీ నిర్మాత పిలిచినట్లు తెలుస్తోంది. అయితే ఆ మూవీ నటీనటులు అంతా తమలో ప్రతి ఒక్కరికీ 5 లక్షలు చొప్పున పారితోషికం ముందుగా ఇస్తేనే తాము ఇంటర్వ్యూకు వస్తామని ఖచ్చితంగా చెప్పడంతో మారుమాట్లాడకుండా నిర్మాత వారు అడికినట్లుగా డబ్బులు ఇచ్చి తన సినిమాను ప్రమోట్ చేయించుకున్నట్లు తెలుస్తోంది..
 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: