అనుష్క శర్మ వాచ్ ధర ఎంతో తెలుసా..!?

N.ANJI
బాలీవూడ్ నటి అనుష్క శర్మ అందరికి సుపరిచితురాలే. ఆమె టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఆయన సతీమణి అనుష్క శర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అంతేకాక.. క్రికెట్ ఆటతో కోహ్లీ.. సినిమా, చిన్నారి వామికా అలనాపాలనతో అనుష్క ఫుల్ బిజీగా మారిపోయింది. ఆమె ఎంత బిజీలో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు తమ వ్యక్తిగత, వృత్తికి సంబందించిన ప్రతి విషయాన్ని ఈ ఇద్దరు అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఇక తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అనుష్క శర్మ ఓ ఫోటోని షేర్ చేసుకుంది. అది ఇప్పుడు వైరల్ గా మారింది.
అయితే ఆ ఫొటోలో ఆమె స్టైలిష్‌ హెయిర్ కట్‌తో బ్లాక్‌ అండ్‌ వైట్‌ టాప్‌ ధరించడంతో పాటు చేతికి ఖరీదైన వాచ్‌ను పెట్టుకుంది. అయితే అనుష్క శర్మ పెట్టుకున్న రోలెక్స్ వాచ్‌ నెటిజన్ల దృష్టిని ఆకట్టుకుంటుంది. అయితే అనుష్క పెట్టుకున్న రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా రోజ్ డయల్ 18 కే ధర 65,879 డాలర్లు అంటే.. భారత కరెన్సీలో దాదాపు రూ. 50లక్షలు ఉంటుంది. ఇక ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.
ఇక ఆమె పెట్టుకున్న ఖరీదైన వాచ్‌ గురించి కొందరు అభిమానులు మాట్లాడుకుంటే.. ఇంకొందరు మాత్రం మాస్క్ మర్చిపోయావ్ అని ట్రోల్‌ చేస్తున్నారు. అంతేకాదు.. రూ. 50లక్షల వాచ్‌ పెట్టావ్‌‌.. మాస్క్‌ మాత్రం మరిచిపోయావ్ " అంటూ నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. ఇక అయితే అంతకుముందు అనుష్క ఇంకో వీడియోలో మాస్క్ పెట్టుకోమని అభిమానులను కోరడం విశేషం అనే చెప్పాలి.
కాగా.. లేటెస్ట్ గా విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మల కుమార్తె వామికా 6వ నెలకు అడుగుపెట్టడంతో ఒక పార్క్‌లో వేడుకలను ఘనంగా చేసుకున్నారు. ఈ సందర్బంగా.. "మన ముగ్గురికి హ్యాపీ 6 మంత్స్‌" అంటూ చిన్నారితో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఇక ఇందులో వామికాను గుండెలపై ఆడిస్తూ అనుష్క కనిపించగా, కోహ్లి తన గారాలపట్టిని ముద్దు చేస్తూ కనిపించారు. అంతేకాక.. ఏ ఒక్క ఫొటోలోనూ వామిక ముఖం కనబడకుండా అనుష్క జాగ్రత్త పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: