ప్రయోగానికి సిద్దమైన స్వీటీ... ?

VAMSI
గ్లామర్ అంటే హీరోయిన్.. హీరోయిన్ అంటేనే గ్లామర్ అంతగా సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా ప్లస్ అవుతారు కథానాయికలు. గ్లామర్ గా ఉంటేనే హీరోయిన్ గా అవకాశాలు వస్తాయన్నది అందరికీ తెలిసిన సత్యమే. అయితే దాదాపు అన్ని సినిమాలలోనూ హీరోలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కథలో వారి పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అయితే ఈ మద్య కాలంలో ట్రెండ్ మారింది. ఇటీవల కథానాయికలకు అధిక ప్రాధాన్యం ఉండే చిత్రాలు కూడా వస్తున్నాయి. దాంతో ఇప్పటి వరకు అందాల ఆరబోతకు, గ్లామరస్ రోల్స్ కు మాత్రమే పరిమితమైన హీరోయిన్లు సరికొత్తగా వైవిధ్యభరితమైన పాత్రలలో దర్శనమిస్తూ ప్రేక్షకుల్ని తమదైన శైలిలో అలరిస్తున్నారు. మరి కొంతమంది హీరోయిన్లు డీ గ్లామర్ రోల్స్ లో నటిస్తూ ఆడియన్స్ ను మెప్పించి సత్తా చాటారు.
అగ్ర కథానాయిక అనుష్క సైతం బాహుబలి చిత్రంలో డీగ్లామర్ పాత్రలో, అందులో వయసు మీద పడ్డ మహిళ పాత్రలో నటించి అబ్బురపరిచింది, అందరి చేత ప్రశంసలు అందుకుంది. అయితే ఇప్పుడు స్వీటి మరో సారి డీ గ్లామర్ పాత్రను పోషించడానికి రెడీ అవుతున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినబడుతున్నాయి. తను చేయబోయే తదుపరి చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో జేజమ్మ కనిపించబోతున్నట్లు సమాచారం. ఓ  పాత్రలో ఫుల్ గ్లామర్ గా అందాల విందు. మరో పాత్రలో డీ గ్లామరస్ రోల్ లో అనుష్క కనువిందు చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

సినిమా సినిమాకి భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తన క్రేజ్ ను అంతకంతకు పెంచుకుంటున్న అరుంధతి ఇంతకీ ఈ డ్యూయల్ రోల్స్ చేయబోతున్నది నిజమేనా ? ఏ సినిమాలో చేయబోతోంది అన్న పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ప్రస్తుతం అనుష్క ఒక యువ కథానాయకుడి సినిమాలో నటించనుంది. ఈ మధ్యనే జాతిరత్నాలు తో సూపర్ హిట్ అందుకున్న నవీన్ పోలిశెట్టితో అంది తెలిసిందే. కానీ ఇంకా ఈ సినిమా షూటింగ్ ఇతరత్రా వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: