టాలీవుడ్ లో కొత్త భామల సందడి..!

NAGARJUNA NAKKA
టాలీవుడ్ లో కొత్త ఆలోచనలకు ఎపుడూ ఆదరణ ఉంటుంది. అలాగే కొత్త హీరోయిన్ లను కూడా ఎంకరేజ్ చేస్తారు. హీరోలు కూడా ఆ కుర్ర భామలతో ఆడిపాడేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇపుడు తెలుగు ఇండస్ట్రీలో అదే జరుగుతోంది.
నజ్రియా. ఈ అందాల భామ తమిళ, మలయాళ చిత్రాల్లో మంచి పేరు తెచ్చుకుంది. ఆమె వివాహ బంధంలోకి  అడుగు పెట్టినా.. అవకాశాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. ఇంటిదాకా వచ్చి తలుపు తట్టిన ఛాన్స్ లను కాదనలేక సినిమాల్లో మళ్లీ ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. నాని హీరోగా నటిస్తున్న అంటే సుందరానికి మూవీలో యాక్ట్ చేస్తోంది. అంతకుముందు తమిళ డబ్బింగ్ మూవీ అయిన రాజారాణిలో ఆర్య సరసన నటించి ప్రేక్షకులను అలరించింది. ఇపుడు ఆమె తెలుగు మూవీ చేస్తుండటంతో ఆ సినిమాపై ఆసక్తి నెలకొంది.
ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఏజెంట్ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో అఖిల్ కొత్తగా కనిపిస్తున్నాడు. అదేవిధంగా న్యూ హీరోయిన్ ప్రేక్షకులను ఫిదా చేయనుంది. సాక్షి వైద్య ఇప్పటికే హాట్ ఫోటోలతో నెటిజన్లను హీటెక్కిస్తోంది.  
ఇక మిస్ గ్రాండ్ ఇండియా 2018 మీనాక్షి చౌదరి కూడా రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తోంది. సుశాంత్ మూవీ అయిన ఇచట వాహనాలు నిలుపరాదు.. రవితేజ మూవీ ఖిలాడీలో యాక్ట్ చేయాల్సి ఉండగా.. కరోనా దెబ్బకు వాయిదా పడ్డాయి.
మొత్తానికి టాలీవుడ్ ను కొత్త అందాలు పలుకరించబోతున్నాయి. తమ అభిమాన హీరోల పక్కన కుర్ర హీరోయిన్ లు కనిపించి మెస్మరైజ్ చేయనున్నారు. దీంతో తెలుగు ఇండస్ట్రీ కొత్త ముఖాలతో కళకళలాడనుంది. మరి అడుగుపెడుతున్న వేళ.. ఎలాంటి అద్భుతాలు చేస్తారో చూడాలి.

టాలీవుడ్ లో కొత్త భామలు సందడి చేస్తున్నారు. న్యూ హీరోయిన్స్ తో టాలీవుడ్ కళకళలాడుంతోంది. తమ అభిమాన హీరోల పక్కన కొత్త అందాలన చూసి మురిసిపోబోతున్నారు సినీ అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: