తెలుగు లో వారి మ్యూజిక్ మ్యాజిక్ పనిచేయట్లేదేంటి!!

P.Nishanth Kumar
టాలీవుడ్ లో సంగీతానికు ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ప్రేక్షకులు కూడా ప్రతి సినిమాలోని పాటలను, నేపథ్య సంగీతాన్ని ఎంతో బాగా ఆస్వాదిస్తారు. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో మ్యూజికల్ హిట్ సినిమాలు రాగా ఆ సినిమాలోని పాటలు సంగీత ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ప్రేక్షకులు మెచ్చే విధంగా, వారు నచ్చే విధంగా ఎన్నో సూపర్ హిట్ పాటలను అందించారు సంగీత దర్శకులు. వాస్తవానికి దేశంలో లో ఏ సినిమా పరిశ్రమ కూడా సంగీతానికి టాలీవుడ్ ఇచ్చే ప్రత్యేకతను ఇవ్వదు. 

తెలుగు వారే కాకుండా ఇతర భాషలలోని సంగీత దర్శకులు కూడా టాలీవుడ్ సినిమాలకి సంగీతం అందించారు. తమిళం మలయాళం కన్నడ హిందీ చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు సంగీత దర్శకులు తెలుగులో సత్తాచాటినట్లే ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులను మెప్పించడంలో తడబడ్డారు. నాగార్జున మజ్ను సినిమా తో లక్ష్మీకాంత్ ప్యారేలాల్, అంతం సినిమా తో ఆర్.డి.బర్మన్, గ్యాంగ్ లీడర్ తో బప్పిలహరి, నిన్నే పెళ్ళాడతా సూపర్ వంటి చిత్రాలతో సందీప్ చౌతా ఇలా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లు మొదట్లో కొన్ని సినిమాలతో వావ్ అనిపించినా ఆ తరువాత అలరించలేకపోయారు.

ఇప్పటి జనరేషన్ సంగీత దర్శకులు కూడా అదే బాటలో నడుస్తున్నారు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ మ్యూజికల్ ట్రయో  శంకర్ ఏషన్ లోయ్ సాహో తో ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాడు. సైరా,వి సినిమా ద్వారా బాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అమిత్ త్రివేది టాలీవుడ్లోకి వచ్చి మెప్పించలేక పోయాడు. మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ మొదట్లో పర్వాలేదనిపించినా ఇప్పుడు పెద్దగా ప్రభావం చూపలేక పోతున్నాడు. తమిళ సంగీత దర్శకులు అనిరుద్, జీవి ప్రకాష్, విశాల్ చంద్రశేఖర్, యువన్ శంకర్, హారిస్ జయరాజ్ లు వారి వారి భాషల్లో అదరగొడుతున్నా కూడా ఇక్కడ మాత్రం తేలిపోతున్నారు. దేవిశ్రీప్రసాద్, తమన్, మణిశర్మ లు మాత్రమే టాలీవుడ్ లో అందరికీ ఆప్షన్స్ గా కనిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: